https://oktelugu.com/

ITDP: త్వరలో మరో ఎంపీ వీడియో… ఐటీడీపీ అంత పనిచేస్తోందా?

ITDP: ఏపీలో మరో ఎంపీ రాసలీలల బాగోతం బయటపడనుందా? హిందూపురం ఎంపీ మాధవ్ మాదిరిగా మరో న్యూడ్ వీడియో వెలుగులోకి రానుందా? ఇందుకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేరు అవుతోందా? సరైన సమయంలో సోషల్ మీడియాలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తునారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియో వదిలింది ఎవరనేది అంతు […]

Written By:
  • Dharma
  • , Updated On : August 8, 2022 / 01:18 PM IST
    Follow us on

    ITDP: ఏపీలో మరో ఎంపీ రాసలీలల బాగోతం బయటపడనుందా? హిందూపురం ఎంపీ మాధవ్ మాదిరిగా మరో న్యూడ్ వీడియో వెలుగులోకి రానుందా? ఇందుకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేరు అవుతోందా? సరైన సమయంలో సోషల్ మీడియాలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తునారా? అంటే అవుననే ప్రచారం సాగుతోంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియో వదిలింది ఎవరనేది అంతు పట్టడం లేదు. అయితే వైసీపీ నాయకులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఒక సంస్థపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తప్పకుండా వారి పనేనని భావిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ. ఇప్పుడు ఐటీడీపీ విభాగం చుట్టూ అందరి కళ్లు ఉన్నాయి. అటు గోరంట్ల మాధవ్ నేరుగా టీడీపీ నాయకుల పేర్లు బయటకు చెప్పారు. పలానా సామాజికవర్గం నేతలే ఈ కుట్ర చేశారని ఆరోపిస్తూ తిట్ల దండకానికి దిగారు.

    ITDP

    బలమైన వింగ్ గా…
    గడిచిన ఎన్నికలకు ముందు రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ బలంగా పనిచేసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంలో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత అటువంటి వింగ్ నే తయారు చేయాలని నిర్ణయించింది. నియోజకవర్గానికి 30 మంది చొప్పున యాక్టివ్ సభ్యులను ఎంపిక చేసి ఐటీడీపీ వింగ్ ను ఏర్పాటుచేసింది. ఏపీలోప్రస్తుతం ఐటీడీపీ వింగ్ యాక్డివ్ గా పనిచేస్తోంది. నియోజకవర్గాల్లో తాజా పరిణామాలు, అధికార పార్టీ నాయకుల వ్యవహార శైలి, వారి కదలికలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలను హైలెట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడంతో పాటు టీడీపీపై సానుకూలత పెంచంలో ఐటీడీపీ వింగ్ చురుగ్గా పనిచేస్తోంది. ఇక్కడ పనిచేస్తున్న వారికి రూ.30వేలకు పైగా వేతనం అందిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

    వివేకా హత్యపై…
    ఎన్నికలకు ముందు సీఎం జగన్ బాబాయ్, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈఘటనపై విపక్ష నేతగా ఉన్న జగన్ స్పందించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఓవరాల్ గా ఈ ఘటన జగన్ కు రాజకీయంగా లబ్ధి చేకూర్చింది. అయితే ఎన్నికల అనంతరం మాత్రం హత్య దర్యాప్తు మరుగున పడిపోయింది. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కూడా జగన్ ప్రకటించారు. దీంతో వివేకా కుమార్తె సునీత తెరపైకి వచ్చారు. ఆమె డిమాండ్ మేరకు సీబీఐ దర్యాప్తును ఏర్పాటుచేశారు. కానీ జగన్ స్వరంలో మార్పుపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగింది. దీని వెనుక ఐటీడీపీ ఉందన్న టాక్ అయితే ఉంది. ‘హూకిల్డ్ బాబాయ్’ అంటూ సంధించిన ప్రచారాస్త్రం తెలుగునాట ప్రాచుర్యం పొందింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ సోషల్ మీడియావిభాగం ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ‘హూకిల్డ్ పిన్ని’ అన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. లోకేష్ పై ఆరోపణలు చేసింది. వైసీపీకి కీలక నేత విజయసాయిరెడ్డి సైతం దీనిపై ఘాటుగా స్పందించారు. రాజకీయ హాట్ హాట్ కామెంట్లు, పరస్పర కౌంటర్లు ప్రారంభమవుతుందన్న వేళ గోరంట్ల మాధవ్ అంశం తెరపైకి వచ్చింది.

    ITDP

    వైరల్ చేసింది వారే?
    అయితే ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. లక్షలాది మందికి రీచ్ అయ్యింది. దీనిని ఐటీడీపీ విభాగమే షేర్ చేసిందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. పరిచయాలను ఉపయోగించి ట్రాప్ చేసిందన్న ప్రచారం నడుస్తోంది. ఎంపీ గోరంట్ల మాధవ్ ను పక్కాగా ట్రాప్ చేసి వీడియో రికార్డు చేయించారని భావిస్తున్నారు. ట్యాగ్ చేసింది.. వైరల్ చేసింది. ఫేస్ బుక్ లో ప్రమోషన్ చేయించింది కూడా టీడీపీ నేతల పనేనని అనుమానిస్తున్నారు. అయితే ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు, అధికార పార్టీకి ఇబ్బందికర పరిస్థితులను తలెత్తినప్పుడు వైసీపీ సర్కారు యాక్షన్ కు దిగుతుంది. కానీ అటు మాధవ్ పై చర్యలు తీసుకోకుండా.. ఇటు విపక్షాల అరెస్టులు లేకుండా సర్కారు సైలెంట్ గా ఉంది. అయితే ఎందుకో ఎదురుచూస్తున్న పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అయితే ఐటీడీపీ విభాగం వద్ద మరో ఎంపీ వీడియో ఉందని.. సరైన టైమ్ లో రిలీజ్ చేయనున్నట్టు మాత్రం ప్రచారం సాగుతోంది.

    Tags