YCP MLA: ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ అధిష్టానం నియోజకవర్గాల ఇన్‌చార్జీల మార్పుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలను వీడుతున్నారు. ఈ క్రమంలో మరో ఎమ్మెల్యే ఫిబ్రవరి 5న పార్టీని వీడుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ఆయన కాసేపట్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులతో మంతనాలు జరిపిన సదరు ఎమ్మెల్యే తుది ప్రకటన కోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. తాను ఏ పార్టీలోకి వెళ్లబోయేది కూడా చెబుతారని తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీలో ఎమ్మెల్యే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
పార్టీని వీడనున్న వసంత కృష్ణప్రసాద్
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున అసెంబ్లీకి పోటీ చేశారు వసంత కృష్ణప్రసాద్. మైలవరం ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో గెలిచన కొద్ది మంది కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోల సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ సీఎం జగన్‌కు వ్యాపార భాగస్వామి. కేసుల్లో కూడా భాగస్వామి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వసంత వైసీపీని వీడాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది.
జోగి రమేశ్‌కు అనుమతి..
మైలవరంలో వసంతకు ఎలాంటి సమస్య లేదని సంకేతాలు ఇచ్చిన వైసీపీ అధిష్టానం.. తర్వాత మంత్రి జోగి రమేశ్‌ను రంగంలోకి దించింది. నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యానికి అనుమతి ఇచ్చింది. మరోవైపు స్థానికంగా కమ్మ సామాజికవర్గం నుంచి వసంతపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో అధిష్టానం మాటను వసంత పట్టించుకోలేదు. ఈ కారణంతో వసంతకు టికెట్ ఇవ్వడంపై వైసీపీ పునరాలోచన చేసింది. దీంతో పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు కృష్ణప్రసాద్. ఇప్పటికే జగన్‌లో పలుమార్లు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో పార్టీకి గుడ్‌బై చెప్పేందుక వసంత సిద్ధమయ్యారు.
టీడీపీలో చేరిక?
ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ టీడీపీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన వైసీపీని వీడాలని డిసైడ్ అయ్యారు. అయితే పార్టీని వీడేందుకు కారణాలను ఆయన ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తారని తెలుస్తోంది. వసంత టీడీపీలో చేరితే.. మైలవరంలో గెలిచిన దేవినేని ఉమకు మరో నియోజకవర్గం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Another mlas shock for ycp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com