Vishnu Swamy Jeeyar: అది ముచ్చింతల్ లోని జీయర్ మఠం. ఇటీవల నెలకొల్పిన సమతా మూర్తి విగ్రహంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికంగా శోభిల్లుతోంది. సాధారణంగా జీయర్ మఠం అంటే చినజీయర్ స్వామి గుర్తుకు వస్తారు.. ఆయన ఆశీర్వచనాలు తీసుకునేందుకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉంటారు. పైగా అక్షేత్రం కేవలం ఆధ్యాత్మికతను మాత్రమే కాకుండా, సనాతన ధర్మాన్ని బోధిస్తుంది. విద్యార్థులకు ఆయుర్వేద వైద్యంలో విద్యను అందిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే నిలువెత్తు భారతీయతకు దర్పణంగా కనిపిస్తుంది. కానీ అలాంటి క్షేత్రంలో ఇప్పుడు “విష్ణు” మాయ జరుగుతున్నది. సాక్షాత్తు చిన జీయర్ స్వామి అల్లుడుగా అందులోకి ప్రవేశించిన వ్యక్తి.. పగలు యోగి లాగా, రాత్రి భోగి లాగా మారడంతో జీయర్ మఠం పరువు పోతోంది.
నెంబర్ _2 గా..
వాస్తవానికి జీయర్ మఠంలో చిన జీయర్ స్వామి చెప్పిందే వేదం. కానీ ఇటీవల చిన జీయర్ స్వామి సోదరి కుమారుడు విష్ణు స్వామి అందులోకి ప్రవేశించాడు. చిన జీయర్ తర్వాత ఆయనే అనే లాగా ఎదిగాడు. వాస్తవానికి విష్ణు స్వామి ఎవరు అనేది చాలామందికి తెలియదు.. అయితే తెలిసినవారు ఆ సంబంధం గురించి అడిగితే అదంతా పూర్వాశ్రమం సంగతి అని చెబుతుంటారు. ప్రస్తుతం విష్ణు స్వామి జీయర్ విద్యాసంస్థలకు సంబంధించిన వ్యవహారాలు పరిశీలిస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండేవారు. తర్వాత జీయర్ ఆశ్రమానికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే బాధ్యత భుజానికి ఎత్తుకున్నారు. చిన జీయర్ తర్వాత ఉత్తరాధికారి విష్ణు స్వామి అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది అంటే అక్కడ అతడి పలుకుబడి అర్థం చేసుకోవచ్చు. జీయర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆస్తుల వ్యవహారాలు కూడా విష్ణు స్వామి చూస్తున్నాడని తెలుస్తోంది.. అందుకే అతడి ప్రభ ఆ స్థాయిలో వెలిగిపోతుందని ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. స్వయానా అల్లుడు కావడంతో చిన జీయర్ స్వామికి విష్ణు స్వామి నోట్లో నాలుక అయ్యాడు.. ఇటీవల జీయర్ స్వామి అమెరికా వెళ్తే ఆయనతోపాటు పయనించాడు. అదే కాదు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి ముచ్చింతల్ లోని జీయర్ స్వామి ఏర్పాటు చేసిన దివ్య సాకేత క్షేత్రానికి వచ్చి 108 అడుగుల రామానుజాచార్యుల వారి సమత మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆరోజు ప్రధానమంత్రి తో పాటు ఒక యువస్వామి కూడా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ యువస్వామి హడావిడి చేశాడు. ఇటీవల జరిగిన ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిన జీయర్ తో కలిసి వచ్చి తెగ సందడి చేశాడు. ఇవన్నీ మచ్చుకు ఉదాహరణలు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే విష్ణు స్వామి లీలలు ఒక పట్టాన కొరుకుడు పడవు.
ఆయన రూటే వేరు
తెల్లటి ధోవతి, ఉత్తరీయం ధరించి.. పుజాపునస్కారాలు చేస్తూ, పరమ ధార్మికుడి లాగా, బుద్ధిమంతుడు లాగా కనిపించే విష్ణు స్వామీ లో మరో కోణం కూడా ఉంది. అదే జల్సా పురుషుడి కోణం. ఆ అవతారం ధరించినప్పుడు ఆయన జీన్స్ ప్యాంటు, ఖరీదైన టీషర్ట్ లు వేసుకుంటారు. అత్యంత విలాసవంతమైన కార్లలో అమ్మాయిలతో కలిసి సూపర్ స్పీడ్ తో దూసుకుపోతారు. నిత్యం పూజలు చేసే చేతులతో రివాల్వర్ కూడా తిప్పుతారు. బెంగళూరు లాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద పబ్బులకు వెళ్లి సేద తీరుతారు. మద్యపానం, ధూమపానం చేసేవారిని చుట్టూ పెట్టుకుంటారు. చెవులు హోరెత్తించే సంగీతం వినిపిస్తుండగా ఎంజాయ్ చేస్తారు. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే దేశంలో తిరిగి ఏ వాహనం వివరాలైనా ఆన్లైన్ లో తెలుసుకునే అవకాశం ఉంది. ఆ నంబర్ తో సెర్చ్ చేస్తే వాహన యజమాని పేరు, చిరునామా వంటివి వస్తాయి
కానీ విష్ణు స్వామి తిరిగే కారు వివరాలు అలా ఉండవు. వాహన యజమాని పేరు అనేచోట నల్ అని వస్తుంది. మరి అలా వచ్చేలా ఎలా మేనేజ్ చేశారో తెలియదు. ఆయన కారు నంబరు ఏపీ 37 సి యు 0999. ఇందులో సున్నా తీసేసి నెంబర్ ప్లేట్ పై ఏపీ 37 సి యు 99 గా పేర్కొన్నారు. ఇది తమ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించడమే అని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. పైగా ఆ నంబర్ పేరుతో ఉన్న కారు అధిక వేగంతో వెళుతుండడంతో తెలంగాణ రవాణా శాఖ అధికారులు జరిమానా కూడా విధించారు. అయినప్పటికీ విష్ణు స్వామి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. పైగా పగలు యోగి లాగా.. రాత్రి భోగి లాగా నెరిపే వ్యవహారాలు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువయ్యాయి.
రియల్ వ్యక్తులతో సంబంధాలు
సమతా మూర్తి విగ్రహం ఆవిష్కరణ తర్వాత ముచింతల్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంది. జీవో 111 ను కూడా ప్రభుత్వం ఎత్తి వేయడంతో భారీగా వెంచర్లు వెలుస్తున్నాయి. ఆశ్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలు పెరిగాయి. రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు చాలామంది పలు వెంచర్లు విల్లాల ప్రారంభోత్సవానికి జీయర్ స్వామిని ఆహ్వానించేందుకు వస్తూ ఉంటారు. ఇలా వస్తున్న వారిలో కొందరితో విష్ణు స్వామికి ఏర్పడిన పరిచయాలు ఆర్థిక సంబంధాలుగా మారినట్టు తెలుస్తోంది. తనకు ఉన్న పరపతి ద్వారా విష్ణు స్వామి కొన్ని భూ వివాదాలు కూడా పరిష్కరించినట్టు సమాచారం. సంబంధాల ద్వారానే విష్ణు స్వామి పక్కదారి పట్టారని ప్రచారం సాగుతోంది.
పేరుకే..
చట్టం అనుమతించిన వయసు వస్తే పబ్ కే కాదు.. తమకు నచ్చిన చోటికి వెళ్లే హక్కు అందరికీ ఉంటుంది. కానీ మద్య మాంసాలు మనిషికి చేటు చేస్తాయి అని ప్రవచించే జీయర్ స్వామి మేనల్లుడై ఉండి.. ఆయనతో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి.. ఆశ్రమ వాసి అయి ఉండీ.. పబ్ కు వెళ్తే ఆ చెడ్డపేరు తన కాదని, జీయర్ స్వామికి వస్తుందన్న గ్రహింపు విష్ణు స్వామికి లేకపోవడం ఇక్కడ విశేషం. పైగా ఆయన సిగరెట్, మద్యం తాగుతారని, మాంసం కూడా తింటారని ప్రచారం జరుగుతోంది. యువతులతో విలాసవంతమైన భవనాల్లో గడుపుతారని చర్చ జరుగుతుంది.. అయితే ఇన్నాళ్లు జీయర్ మఠం అంటే నిష్టా గరిష్టంగా ఉంటుందని అందరూ అనుకునేవారు.. కానీ అవన్నీ బయట ప్రచారానికి మాత్రమే అని విష్ణు స్వామి ఉదంతం నిరూపిస్తోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Another angle of chinna jeeyar swamy nephew vishnu swamy jeeyar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com