Annamalai : తమిళనాట బీజేపీ నేత అన్నామలై ప్రతిష్ట రోజురోజుకు పెరుగుతోంది. అధికార డీఎంకే ప్రతిష్ట మెల్లిమెల్లిగా తగ్గుతోంది. తిరుగులేని పార్టీలు చతికిలపడుతుండడంతో అన్నామలై బలంగా పుంజుకుంటున్నారు. తమిళనాడులో ప్రస్తుతం ‘ఈరోడ్ ఈస్ట్’ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ లో పెద్ద లీడర్ చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది.
ఈసారి చనిపోయిన చనిపోయిన వర్గం నుంచి ఓ సీనియర్ నేత పోటీకి దిగారు. పోయిన సారి అన్నాడీఎంకే ప్రత్యర్థిగా పోటీచేసింది. ఈసారి మాత్రం అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయి ఇద్దరు బరిలోకి దిగారు. ఈ ఇద్దరూ తమకే మద్దతు ఇవ్వాలని బీజేపీ నేత అన్నామలైని కలిశారు. ఈపీఎస్ గ్రూపు పోటీచేయాలని అన్నామలై సూచించడంతో పన్నీర్ సెల్వం వర్గం పోటీ నుంచి తప్పుకుంది.
తమిళనాడులో అన్నామలై ప్రతిష్ట పెరిగిందనడానికి ఇదే నిదర్శనం. తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు.. అన్నామలై బలోపేతంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.