తెలంగాణని దాటేసినా ఆంధ్రా కరోనా కేసులు!

ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా 100 దాటింది.దీంతో ఆంధ్రలోని కరోనా కేసులు తెలంగాణాని దాటాయి.మంగళవారం రాత్రి వరకు 44 కరోనా కేసులు నమోదు కాగా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది. ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 10:17 am
Follow us on


ఏపీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా 100 దాటింది.దీంతో ఆంధ్రలోని కరోనా కేసులు తెలంగాణాని దాటాయి.మంగళవారం రాత్రి వరకు 44 కరోనా కేసులు నమోదు కాగా మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం బాధితుల సంఖ్య 111కు చేరింది.

ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ కాగా.. కడప, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో 15 మంది చొప్పున, పశ్చిమగోదావరిలో 14 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటివరకు మొత్తం 1313 మందికి పరీక్షలు నిర్వహించగా, 111 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దిల్లీనుంచి తిరిగి వచ్చిన వారిలో 543 మందికి, వారి సన్నిహితులు 269 మందికి పరీక్షలు చేశారు. విదేశాల నుంచి వచ్చినవారు 218 మందికి, వారి సన్నిహితులు 140 మందికి పరీక్షలు నిర్వహించారు. వైరస్‌ లక్షణాలున్న మరో 143 మంది నమూనాలు సేకరించి, పరీక్షలు చేశారు.