AP New Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త మంత్రివర్గం నేడు కొలువుదీరనుంది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందుకుగాను ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఉదయం 11.31 గంటలకు మూహూర్తం కూడా ఖరారైంది. దీంతో మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో కొత్త మంత్రులు కొలువుదీరనున్నారు.

పాత మంత్రులు 11 మంది కొత్త వారు 14 మందితో కలిపి 25 మందితో నూతన మంత్రివర్గం పదవుల్లోకి రానున్నారు. ఈ మేరకు రాత్రి కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు అందజేశారు. ఇప్పటికే పాత మంత్రులు 24 మంది రాజీనామాలు చేయడం తెలిసిందే. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు.
Also Read: జగన్ సర్ ప్రైజ్.. సీనియర్లను కాదని.. రోజాకు హోం, రజినీకి మంత్రి పదవి?
మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. పది మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు, ఎస్టీలకు ఒకటి, మైనార్టీలకు మరొకటి, కాపులకు నాలుగు, రెడ్లకు నాలుగు పదవులు కేటాయించి అన్ని వర్గానలు ఊరడించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమర్థులైన వారిని ఎంచుకున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పదవులు రాని వారు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ పరువు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ అసంతృప్తులు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన పార్టీ వర్గాల్లో వస్తోంది. ఈ క్రమంలో జగన్ ఎంత మేరకు అసమ్మతి నేతలను బుజ్జగించి తన దారికి తెచ్చుకుంటారో తెలియడం లేదు. మొత్తానికి రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి.
Also Read: వైసీపీ లో అసంతృప్తి జ్వాలలు రోడ్డుకెక్కి ఆందోళనలు చేస్తున్న ఎమ్మెల్యేలు, అనుచరులు