Pawan Kalyan Varahi: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రజాధారణ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి..ఈయనకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు చరిష్మా ప్రతీ ఒక్కరు మాకు కూడా ఉంటే బాగుండును అని అనిపించే రేంజ్ లో ఉంటుంది..కానీ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సమయం కలిసి రాకపోతే రాజకీయాల్లో ఓడిపోవాల్సి వస్తుంది..2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి అదే జరిగింది..ఎన్నికలకు కావాల్సిన సమయం దొరకకపోవడం.
ఆయన వ్యూహాలను వక్రీకరించి పచ్చ మీడియా జనాలకు వేరే విధంగా చూపించడం వల్ల పవన్ కళ్యాణ్ ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చింది..కానీ ఈసారి మాత్రం ప్రతీ ఒక్కటి పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా మారాయి..జనసేన పార్టీ క్షేత్ర స్థాయి నుండి ఒక రేంజ్ లో బలోపేతం అయ్యింది..పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు జనాల్లోకి బాగా వెళ్తున్నాయి..ఫలితంగా రోజు రోజుకి ఆయనకీ జనాధారణ పెరిగిపోతుంది.
ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాలు మారిపొయ్యే విధంగా పవన్ కళ్యాణ్ త్వరలోనే బస్సు యాత్ర ప్రారంభించబోతున్నట్టు సమాచారం..అందులో భాగంగా ఆయన పర్యటన కోసం ‘వారాహి’ అనే వాహనం ని కూడా ప్రత్యేకంగా చేయించుకున్నాడు..నిన్న కొండగట్టు ప్రాంతం లో ఆంజనేయ స్వామి సన్నిధిలో ఈ వాహనం కి పూజ చేయించాడు..నేడు విజయవాడ ‘ఇంద్ర కీలాద్రి’ అమ్మవారి దగ్గర కూడా ప్రత్యేక పూజలు చేయించాడు..పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని తెలుసుకున్న అభిమానులు వేలాదిగా ఇంద్ర కీలాద్రి కి చేరుకున్నారు..ఎటు చూసిన ఇసుకేస్తే రాలనంత జనం..అడుగడుగునా నీరాజనం..రాష్ట్ర రాజకీయాల్లో ఈ అరుదైన దృశ్యం హాట్ టాపిక్ గా మారింది.
కేవలం వారాహి ని ఆయుధ పూజకి తెస్తేనే ఇంతటి ప్రకంపనలు రేపితే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దాని మీద పర్యటిస్తే రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో అని రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు..పవన్ కళ్యాణ్ వారాహి ని ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల మీద తిరగనివ్వం అంటూ సవాళ్లు విసిరిన వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్ వెంట వస్తున్నా జన సునామి ని ఆపగలరా..ఆ సాహసం చెయ్యగలరా?, ప్రజాధారణ ఉన్న వ్యక్తిని ఏమి చేయలేమనే విషయాన్నీ ఇప్పటికైనా గ్రహిస్తే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.