https://oktelugu.com/

Annanya Pandy: డ్రగ్స్ కేసు.. షాకిచ్చిన విజయ్ దేవరకొండ హీరోయిన్

Annanya Pandy: ముంబై కేంద్రంగా ఎంత పెద్ద డ్రగ్స్ దందా సాగుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో బాలీవుడ్ కు లింక్స్ బయటపడి అభాసుపాలైంది. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడి నెలగడుస్తున్నా బెయిల్ దొరక్క ఆపసోపాలు పడుతున్నారు. ఆర్యన్ ఖాన్ ఒక్కడితో ఈ కేసు ముగియడం లేదు.. బాలీవుడ్ యువ హీరోయిన్ అనన్య పాండే మెడ చుట్టూ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2021 / 04:09 PM IST
    Follow us on

    Annanya Pandy: ముంబై కేంద్రంగా ఎంత పెద్ద డ్రగ్స్ దందా సాగుతోందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో బాలీవుడ్ కు లింక్స్ బయటపడి అభాసుపాలైంది. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడి నెలగడుస్తున్నా బెయిల్ దొరక్క ఆపసోపాలు పడుతున్నారు. ఆర్యన్ ఖాన్ ఒక్కడితో ఈ కేసు ముగియడం లేదు.. బాలీవుడ్ యువ హీరోయిన్ అనన్య పాండే మెడ చుట్టూ ఈ కేసు చుట్టుకుంటోంది.

    annanya pande

    తెలుగు హీరో విజయ్ దేవరకొండ హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘లైగర్’లో హీరోయిన్ అనన్యపాండేనే. ఇప్పుడామే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాగా.. అతడితో డ్రగ్స్ గురించి చాట్ చేసి అనన్య దొరికిపోయింది. ఇప్పుడా కేసులో అనన్యను ఎన్సీబీ విచారిస్తోంది.

    అనన్య గత మూడు రోజులుగా ఎన్సీబీ విచారణకు హాజరవుతూ తన ప్రమేయం లేదంటూ బోరుమని ఏడుస్తోందట.. విచారణలో తాను డ్రగ్స్ వాడను.. కేవలం ఆర్యన్ తో డ్రగ్స్ గురించి జోక్ చేశానని చెబుతోందట.. అయితే ఆర్యన్ మాత్రం డ్రగ్స్ గురించి అనన్యను అడిగేవాడని ఎన్సీబీ విచారణలో కనుగొంది.

    దీంతో ఈ కేసులో ఎలా తప్పించుకోవాలో తెలియక.. తాజాగా మూడురోజుల విచారణ అనంతరం నాలుగోరోజు అనన్య హాజరు కాలేదు. తన వృత్తిపరమైన పనుల కారణంగా విచారణకు రావడం లేదని లాయర్ల ద్వారా ఎన్సీబీ అధికారులకు షాకిచ్చిందట..