Homeఆంధ్రప్రదేశ్‌Mlc Anantha Babu: అనంతబాబు హత్య కేసు.. జగన్‌కు అగ్ని పరీక్ష!! నిష్పక్షపాత విచారణ జరిగేనా?

Mlc Anantha Babu: అనంతబాబు హత్య కేసు.. జగన్‌కు అగ్ని పరీక్ష!! నిష్పక్షపాత విచారణ జరిగేనా?

Mlc Anantha Babu: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరో అగ్ని పరీక్ష ఎదుర్కొబోతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన మర్డర్‌పై నిష్పక్షపాత విచారణ జరగాలి. ఎందుకంటే హత్యను అనంతబాబు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో జగన్‌ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే అందరినీ ఆలోచింపజేస్తోంది.

Mlc Anantha Babu
Anantha Babu, Jagan

అనంతబాబు అరాచకాలు బయటకు తీస్తారా?

అధికారం ఉందనుకున్నాడు.. ఏది చేసినా చెల్లుతుందని తన మాజీ డ్రైవర్‌ను మట్టుపెట్టిన ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. రోడ్డ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇందుకు తన అధికారాన్ని మొత్తం ఉపయోగించుకున్నాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిజం నిప్పులాంటిది కదా.. దాగలేదు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు లొంగిపోయాడు. నేరాన్ని కూడా తానే చేశానని అంగీకరించాడు. తన సొంత వ్యవహారాల్లో తలదూర్చినందుకే సుబ్రమణ్యంను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు.

Also Read: Maa Reality Show: ‘ మా ’ కష్టాలు.. మనందరికీ నష్టాలు..!! రియాల్టీ షో.. ప్రేక్షకులకు తలనొప్పులు!

ఇక జగన్‌దే నిర్ణయం…

హత్యానేరాన్ని అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబుపై సీఎం జగన్‌ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి గా మారింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఇన్‌వెస్ట్‌మెంట్‌ సమ్మీటలో పాల్గొనేందకు దావోస్‌ వెళ్లిన జగన్‌ ప్రస్తుతం అక్కడ బిజీగా ఉన్నారు. రెండు రోజుల్లో తిరిగి రాష్ట్రానికి రానున్నారు. డ్రైవర్‌ హత్యపై స్థానిక నాయకులు ఇప్పటికే జగన్‌కు పూర్తి సమాచారం అందించారు. ఆయన వచ్చాక ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

వరుస తలనొప్పులు..

మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నాటి నుంచి జగన్‌కు వరుస తలనొప్పులు ఇబ్బంది పెడుతున్నాయి. మంత్రివర్గంలో మార్పులు చేర్పులతో అలిగిన నేతలను బుజ్జగించడం, స్థానం కోల్పోయిన వారికి సముచిత స్థానం ఇవ్వడం జగన్‌కు సవాల్‌గానే మారింది. తర్వాత పోలవరం డయాఫ్రం వాల్‌కు బీటలు రావడం. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. మరోవైపు వరుస అత్యాచారాలు జగన్‌ సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవలే ఓ ఎమ్మెల్యేపై ప్రజలే తిరగబడ్డారు కూడా. తాజాగా ఎమ్మెలీస అనంతబాబు చేసిన హత్య. ఇలా వరుస తలనొప్పుల నేపథ్యంలో జగన్‌ నిష్పక్షపాత విచారణ చేయిస్తాడో లేదో వేచిచూడాలి.

Also Read: YSRCP MLC Anantha Babu: అనంతబాబే హంతకుడు.. డ్రైవర్‌ మర్డర్‌ కేసులో నిజాలు.. ఆయన చరిత్ర అంతా నేరమమయమే!!

Recommended Videos:

https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular