Anand Mahindra: పుట్టుకతోనే పుట్టెడు శత్రువులను సృష్టించుకున్న దురదృష్టం ఇజ్రాయిల్ దేశానిది. లెబనాన్ నుంచి ఇరాన్ వరకు అన్ని దేశాలూ ఇజ్రాయిల్ కు శత్రువులే. అందుకే వాటి నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రక్షణ పరంగా కొత్త కొత్త ప్రయోగాలను చేపడుతుంటుంది. అధునాతన వ్యవస్థలను నిర్మించుకుంది. ఆ దిశగా మరిన్ని అడుగులు వేస్తోంది. ఐరన్ డోమ్.. యారో వంటివి అందులో భాగమే. ఇటీవల ఇరాన్ దాడులు చేసినప్పుడు ఇజ్రాయిల్ యారో తోనే తనను తాను కాపాడుకుంది. గగనతలంలోనే ఇరాన్ క్షిపణులను అడ్డుకోగలిగింది. 300కు పైగా డ్రోన్లు, క్షిపణులు తన దేశం పైకి వస్తున్నప్పటికీ వాటికి సమర్థవంతంగా చెక్ పెట్టగలిగింది. అంతేకాదు ఇరాన్ పైకి ప్రతి దాడిని కూడా మొదలుపెట్టింది. ఇజ్రాయిల్ చూపిన తెగువపై ఓ నెటిజన్ ట్విట్టర్ ఎక్స్ లో ప్రస్తావించాడు. “ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వ్యవస్థ అద్భుతం. దాని రక్షణ వ్యవస్థ అంతకంటే అద్భుతం” అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. దీనికి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఇరాన్ దాడులు చేస్తుంటే ఇజ్రాయిల్ స్పందించిన తీరును ప్రశంసించారు.
“ఇజ్రాయెల్ వద్ద ఐరన్ డోమ్ మాత్రమే కాదు అంతకు మించిన సాంకేతికత ఉంది. బాలిస్టిక్ సహా మధ్య, దీర్ఘ శ్రేణులకు సంబంధించిన క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయిల్ వద్ద “ది యారో , డేవిడ్ స్లింగ్” వంటి వ్యవస్థలు ఉన్నాయి. లేజర్ ను ఉపయోగించి పనిచేసే ఐరన్ భీమ్ వ్యవస్థ కూడా ఉంది. ఇజ్రాయిల్ దేశానికి తన అమ్ముల పొది లో ఈ తరహా రక్షణ వ్యవస్థలు ఉండటం చాలా అవసరం. మన దేశం కూడా ఆ దిశగా దృష్టి సారించి అవసరమైన కేటాయింపులు జరపాలి. అది మన దేశానికి అత్యవసరం కూడా” అని ఆనంద్ మహీంద్రా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు.
వాస్తవానికి ఐరన్ డోమ్ అనే వ్యవస్థను అమెరికా సహకారంతో ఇజ్రాయిల్ దేశం ఎప్పుడో ఏర్పాటు చేసుకుంది. అయితే ఇటీవల పాలస్తీనా దాడులు చేసిన నేపథ్యంలో అంతకుమించి అనే విధంగా ది యారో, డేవిడ్ స్లింగ్ అనే రక్షణ వ్యవస్థలను నిర్మించుకుంది. వీటివల్ల గగనతనంలోనే వివిధ రాకెట్లు, క్షిపణులు, ఇతర డ్రోన్లను అది అడ్డుకుంటుంది. స్థూలంగా చెప్పాలంటే మన పౌరాణిక సినిమాలో అస్త్రాలు పరస్పరం ఢీకొట్టుకున్నట్టు.. అక్కడికక్కడే తునాతునకలు చేస్తుంది. లెబనాన్, హిజ్బుల్లా, హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. శత్రు దేశాలు ఏమాత్రం తమ దేశం పైకి క్షిపణులు ప్రయోగించినా వెంటనే ది యారో, డేవిడ్ స్లింగ్ వ్యవస్థలు అలర్ట్ అవుతాయి.
Mechanisms of warfare are changing. We have to allocate significantly higher portions of the defence budget for the acquisition of specialised drones. But we also should be working on concepts like the Israeli ‘Iron Dome’ to provide an effective cover from drone attacks. https://t.co/QvaO92Ne5d
— anand mahindra (@anandmahindra) June 29, 2021