Homeజాతీయ వార్తలుAnand Mahindra: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Anand Mahindra: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Anand Mahindra:  ప్రధాని మోడీ.. ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైంది. రెండు పర్యాయాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పేరు కారణమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనువైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు మోడీ. తాజాగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. బీజేపీ ఓటమి ఖాయమని చాలా పార్టీలు అంచనా వేశాయి. అదే విషయాన్ని బహిరంగంగానే చెప్పాయి. కానీ ఆ అంచనాలను తారు మారు చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో విజయ పతాకం ఎగరేసింది బీజేపీ. దీంతో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి.

Anand Mahindra
Anand Mahindra

ఇక ఆనంద్ మహీంద్రా.. ఈ పేరు గురించి అందరికీ తెలుసు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈయన గురించి తెలియకుండా ఉండదు. ఎప్పటికప్పుడు ఫొటోలతో మెసెజ్ ఇస్తూ పోస్టులు పెడుతుంటారు. ప్రజల్లో అవగాహన కల్పించేలా వ్యవహరిస్తుంటారు. వీటితో పాటుగా కొన్ని కామెడీ ఫొటోలను సైతం షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు మహీంద్రా ఆనంద్. ఆయన చేసిన పోస్టులు అందులోని సందేశాన్ని చెప్పకనే చెబుతుంటాయి. వాటిని పెద్దగా వివరించాల్సిన అవసరం కూడా ఉండదు. చూస్తే చాలు ఆ ఫొటోలోని సందేశం చాలా సులువుగా అర్థమవుతుంది.

Also Read:  చంద్రబాబుపై బాంబు పేల్చిన మమతా బెనర్జీ.. అంత దారుణానికి బాబు దిగజారాడా?

ఇదిలా ఉండగా.. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో గుజరాత్‌లో పర్యటించారు ప్రధాని మోడీ. అందులో భాగంగా నిర్వహించిన రోడ్ షోలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. అసలు జరిగిన విషయం ఏంటంటే… ప్రధాని మోడీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల చాలా భద్రత కలిగిన కార్లను మాత్రమే ఉపయోగిస్తారు. అవి చాలా ఖరీదైనవి. కానీ గుజరాత్ పర్యటనలో ఆయన తన కాస్ట్లీ కార్లను పక్కన పెట్టారు. మహీంద్రా ఆటో సంస్థకు చెందిన ఆఫ్ రోడ్ వెహికిల్ మహీంద్రా థార్‌లో ఆయన ప్రయాణం చేశారు. దాదాపుగా 9 కిలోమీటర్ల పాటు ఆ వాహనంలో ప్రయాణించారు ప్రధాని మోడీ.

Anand Mahindra
Narendra Modi

గుజరాత్ పర్యటనలో తమ కంపెనీకి చెందిన వాహనంలో ప్రధాని మోడీ ప్రయాణించడంపై ఆనంద్ మహీంద్రా చాలా ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్నికల విజయం పరేడ్‌ ను నిర్వహించేందుకు మేడిన్ ఇండియా వెహికల్ కంటే మెరుగైనది ఇంకేదీ లేదు. ధన్యవాదాలు ప్రధాని నరేంద్రమోడీ’ అంటూ తన ట్వీట్ చేశారు మహేంద్రా.

Also Read: TDP- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫర్ పై టీడీపీ మౌనం.. అసలు కారణం ఇదేనా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular