Pawan Kalyan REAL YOGI Book : పవన్ కళ్యాణ్ మానవీయ కోణంలో చూస్తారు. ప్రజలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. పవన్ కళ్యాణ్ పై ఇటీవల గుణ అనే రైటర్ ‘ది రియల్ యోగి’ అనే పుస్తకాన్ని రాశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై రాసిన ఈ పుస్తకం వైరల్ అవుతోంది.
గుణ అనే రైటర్ నిండా 20 ఏళ్లు కూడా లేని యువకుడు. పవన్ ను ఎప్పుడూ చూడలేదు. మాట్లాడలేదు. అయినా పవన్ పై పుస్తకం రాసేంత ప్రేమ గుణకి కలిగింది.
నాయకుడు ఎలాంటి స్వార్థం లేకుండా పది మందికి సాయం చేస్తున్నప్పుడు.. జనం కూడా అలాంటి నాయకుడికి మద్దతుగా చేయాల్సిన పనులు చేస్తాడు. ఇది సామాజిక సూత్రాల్లో ఒకటి. గుణ లాంటి రచయితలు పవన్ లోని ఈ మానవీయతను ఎలుగెత్తి చాటుతున్నారు.
2014లో నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారు. ఆరోజు బీజేపీ మోడీని కాకుండా ఎవరినైనా ప్రధానిగా ప్రకటించకుంటే అధికారంలోకి వచ్చేది కాదు. యూపీలో కూడా యోగిని సీఎం కాకుంటే బీజేపీ గెలిచేది కాదు. నవీన్ పట్నాయక్ కాకుండా వేరే వ్యక్తి పోటీచేస్తే ఇన్ని సార్లు సీఎంగా కాకుండా ఉండేవారు కాదు.మమతా బెనర్జీ, సీనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. నిజాయితీపరురాలుగా గెలిచారు. వీళ్లందరూ కూడా నీతి నిజాయితీ పరులు కావడం విశేషం.
ఢిల్లీలో మోడీని ఓడించి అరవింద్ కేజ్రీవ్ కు సీఎంగా ప్రజలు పట్టం కట్టడం వెనుక కూడా ఇదే నిజాయితీపరుడన్న ముద్ర ఉంది. ఏపీకి కూడా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఇప్పుడిప్పుడే జనాలకు అర్థమవుతోంది. అతడిని సీఎం దారికి దగ్గర చేస్తోంది.
పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీలతో చేస్తున్న పాలిటిక్స్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.