Annamalai Padayatra : తమిళనాడులో బీజేపీ నేత అన్నామలై ఏప్రిల్ 14న పాదయాత్ర మొదలుపెట్టబోతున్నాడు. డాక్టర్ అంబేద్కర్ జయంతి రోజున మొదలుపెట్టి దక్షిణ తమిళనాడులోని తిరుచెందూర్ అనే పట్టణంలో తుత్తుకోడి జిల్లా నుంచి మొదలై సంవత్సరం 234 నియోజకవర్గాలను కవర్ చేస్తాడట.. అయితే ఏంటి దీంట్లో విశేషం అన్నది ఇక్కడ ప్రశ్న.
తెలుగు రాష్ట్రాల్లో లాగా.. తమిళనాడులో పాదయాత్ర కల్చర్ లేదు పెద్దగా.. అన్నామలై పేరు ఇవ్వాలా ప్రజల్లో ఒక సంచలనాన్ని సృష్టిస్తోంది. నిన్న గవర్నర్ వివాదంలో కూడా అన్నామలై ఎక్కడా తగ్గడం లేదు. గవర్నర్ వివరణ ఇచ్చినా కూడా అన్నామలై హేతుబద్దంగా వాదించి డీఎంకేను ఇరుకునపెడుతున్నాడు. డీఎంకేను ఇంతలా ఎక్స్ పోసే చేసే మరో నేత లేకుండా పోయారు. అన్నామలై బలంగా నిలబడుతున్నారు.
డీఎంకే సంస్కృతి రాజకీయాలు చెడిపోయాయి. కరుణానిధి నుంచి స్టాలిన్ వరకూ వీరి రాజకీయాలను అన్నామలై ఎలుగెత్తి చాటుతున్నారు. దేవుడిపై నమ్మకం తమిళుల్లో ఎక్కువ. దారుణంగా కుటుంబ పాలనను ప్రోత్సహించే పార్టీ డీఎంకే. డీఎంకే నేతలు బినామీలను అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల ఎలా వెనకేసుకున్నది అన్నామలై సాక్ష్యాలతో బయటపెట్టబోతున్నాడట.. తనపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇవ్వనున్నారు. రశీదులు చూపించబోతున్నాడట..
తమిళనాడులో అన్నామలై పాదయాత్ర ఎఫెక్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.