Trivikram- Pawan Kalyan: రాజశ్యామల యాగం. రాజయోగం సిద్ధించడానికి పురాణాల్లో రాజులు నిర్వహించేవారు. రాజు బలం పెరగడానికి, శత్రువు బలం క్షీణించడానికి శ్యామలాదేవిని ప్రసన్నం చేసుకునేవారు. పురాణాల్లో ప్రసిద్దికెక్కిన రాజశ్యామల యాగం.. ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఇటీవల కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించారు. ఇప్పుడు పవన్ రాజశ్యామల యాగం చేస్తున్నారని ఓ ప్రచారం జరుగుతోంది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ గురువు ఉన్నారని, ఆయన పవన్ కల్యాణ్ సీఎం కావడానికి రాజశ్యామల యాగం చేయనున్నారని తెలుస్తోంది. మాఘమాసం తొలినాళ్లలో ఈ యాగం నిర్వహిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ నారసింహ క్షేత్రాల పర్యటన కూడ ఆ గురువు సూచనే అని తెలుస్తోంది. ఆ గురువు సూచనను పవన్ కల్యాణ్ తూచ తప్పకుండా పాటిస్తున్నారట.
పవన్ కళ్యాణ్ గురువు ప్రతి యేడు సంక్రాంతికి మొదలుపెట్టి శివరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారట. వెస్ట్ గోదావరిలోని తన సొంత ఊరిలో ఉన్న నారసింహ ఆలయం వద్ద భారీగా హోమాలు నిర్వహిస్తారు. శివరాత్రికి అత్యంత భారీ పూర్ణహుతి జరుగుతుంది. ఈ హోమాలకు కోట్లలో ఖర్చు అవుతుందట.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావడానికి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ తో ఉన్న సాన్నిహిత్యం తెలిసిందే. దీంతో పవన్ తరపున త్రివిక్రమ్ యాగం నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇటీవల కేసీఆర్ కూడ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇప్పుడు పవన్ నిర్వహిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వస్తే కాని ఇలాంటి ప్రచారాన్ని నమ్మలేం.