తాలిబన్ నిజంగానే మారిందా, దానితో చర్చలు జరపాలా..?

ప్రజాస్వామ్య అప్ఘనిస్తాన్ ను తాలిబన్ వశపరుచుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. కరుడుగట్టిన తీవ్రవాదులైన తాలిబన్లతో సయోధ్యకు ఎవరూ ప్రయత్నించడం లేదు. అమెరికా సైతం వైదొలగింది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. అప్ఘన్ సైన్యందే తప్పు అని కాడి వదిలించుకుంది. ఏ దేశం కూడా అప్ఘన్ గురించి ఆలోచించడం లేదు. కానీ భారత ప్రభుత్వం చర్చలు జరపాలన్న డిమాండ్ మన దేశంలోని కొందరు నాయకుల నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఎంపీ అసదుద్దీన్ సహా సమాజ్ వాదీ పార్టీ […]

Written By: NARESH, Updated On : August 21, 2021 2:13 pm
Follow us on

ప్రజాస్వామ్య అప్ఘనిస్తాన్ ను తాలిబన్ వశపరుచుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. కరుడుగట్టిన తీవ్రవాదులైన తాలిబన్లతో సయోధ్యకు ఎవరూ ప్రయత్నించడం లేదు. అమెరికా సైతం వైదొలగింది. సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. అప్ఘన్ సైన్యందే తప్పు అని కాడి వదిలించుకుంది. ఏ దేశం కూడా అప్ఘన్ గురించి ఆలోచించడం లేదు. కానీ భారత ప్రభుత్వం చర్చలు జరపాలన్న డిమాండ్ మన దేశంలోని కొందరు నాయకుల నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఎంపీ అసదుద్దీన్ సహా సమాజ్ వాదీ పార్టీ నేతలు సైతం తాలిబన్లతో భారత్ చర్చలు జరపాలని కోరుతున్నారు.

ఇక తాలిబన్లకు మద్దతు ఇవ్వాలని పాకిస్తాన్ అధ్యక్షుడు డిమాండ్ చేయడం విశేషం… మన దేశంలోని  మత చాందసవాద నాయకులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. తాలిబన్ల ప్రభుత్వం ఇంకా అప్ఘనిస్తాన్ లో ఏర్పడలేదు. వారి విధివిధానాలు ఏర్పడలేదు. ఒకటి రెండు ఇంటర్వ్యూలు తప్పితే అసలు తాలిబన్లు మీడియా ముందుకు వచ్చింది లేదు. ఈ క్రమంలోనే తాలిబన్ నిజంగానే మారిందా? దానితో చర్చలు జరపాలా? అన్న దానిపై స్పెషల్ ఫోకస్ వీడియో…