Pawan Kalyan 3 Options పవన్ కళ్యాణ్ ముందు చేయాల్సిన పని ఇదే!

Pawan Kalyan 3 Options  ఏపీలో అందరూ పొత్తుల గురించి ఆలోచిస్తున్నారు. పొత్తుల పరమావదిగా భావిస్తున్నారు. జనసేనకు మూడు ఆప్షన్లు అంటూ టీవీల్లో, పత్రికల్లో హోరెత్తిస్తున్నారు. దాన్ని చూసి జనసైనికులు కూడా అదే మాయలో పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా గుర్తించని బీజేపీపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే ముందుగా చేయాల్సింది ఈ పొత్తుల గురించి కాదు.. పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలి. ఎప్పుడో రెండేళ్లకు ఉన్న ఎన్నికలకు ఇప్పుడే సీఎం క్యాండిడేట్ […]

Written By: NARESH, Updated On : June 8, 2022 11:56 am
Follow us on

Pawan Kalyan 3 Options  ఏపీలో అందరూ పొత్తుల గురించి ఆలోచిస్తున్నారు. పొత్తుల పరమావదిగా భావిస్తున్నారు. జనసేనకు మూడు ఆప్షన్లు అంటూ టీవీల్లో, పత్రికల్లో హోరెత్తిస్తున్నారు. దాన్ని చూసి జనసైనికులు కూడా అదే మాయలో పడిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా గుర్తించని బీజేపీపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

అయితే ముందుగా చేయాల్సింది ఈ పొత్తుల గురించి కాదు.. పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలి. ఎప్పుడో రెండేళ్లకు ఉన్న ఎన్నికలకు ఇప్పుడే సీఎం క్యాండిడేట్ గురించి ఆ లొల్లి ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. ముందుగా జనసేన క్షేత్రస్థాయిలో బలపడాలి. ప్రతీ గ్రామం, మండలం , నియోజకవర్గస్థాయి నాయకులను తయారు చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలతో సమానంగా ఎదగాలి. అప్పుడు 2024 ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకొని ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే ఇప్పుడు కాలదన్నిన వారే కాళ్ల బేరానికి వస్తారు. ఇలా జనసేన ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.

పవన్ కళ్యాణ్ ఈ పొత్తులు ఎత్తులు.. బీజేపీ, టీడీపీ ఆప్షన్లను వదిలేసి ముందుగా పార్టీ బలోపేతంపై కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా సాగితేనే జనసేనకు ఏపీలో భవిష్యత్ ఉంటుంది. అనవసర వివాదాల్లో తలదూర్చి క్రెడిబులిటీ పోగొట్టుకునే కంటే అధికార వైసీపీ పాలనపై ప్రజల్లోకి వెళ్లి వారి మెప్పు పొందడం మేలు.

కనీసం కొన్నాళ్ల వరకూ పార్టీ నిర్మాణం, జిల్లాల విస్తరణ.. పార్టీ కార్యకలాలపై దృష్టి సారించాలి. ఆ తర్వాత 2024లో ఈ పొత్తుల గురించి చర్చించుకుంటే బాగుంటుంది. దీన్ని మీడియా, టీఆర్పీ కోసం చిలవలు పలువలు చేసి మాట్లాడుకుంటున్నారు. బీజేపీ, జనసేనలు ఈ ట్రాప్ లో పడకండి. ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీన్ని పెద్దది చేసుకోకుండా పార్టీ నిర్మాణంపై దృష్టి సారించి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీని ఎండగట్టడమే జనసేన తక్షణ కర్తవ్యం. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎన్నికల పొత్తులు ఇప్పుడు అవసరమా? అన్న దానిపై ‘రామ్’ గారి విశ్లేషణ వీడియోను కింద చూద్దాం..