Analysis on Nehru Family Politics vs CM KCR Politics : దేశంలో వారసత్వ రాజకీయాలు పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు కామన్ గా మారిపోయాయి.. అది ఇప్పుడు కాదు.. అనాధిగా వస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబానిదే హవా. అయితే.. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ తంతు కనిపిస్తోంది. పార్టీ అధినేతలకు తన వారసత్వాన్ని రాజకీయంగా కొనసాగించడం అనివార్యం. ప్రజామోదం ఉన్న వారికి ఖచ్చితంగా వారసత్వం కలసి వస్తుంది. చాలా రాష్ట్రాల్లోనూ అవి రుజువు అయ్యాయి కూడా. ఉత్తర్ ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగినా, ఆయన నాయకత్వంలో పార్టీ ఓటమి పాలైంది.
మరోవైపు.. తమిళనాడు ఎన్నికలను చూస్తే కరుణానిధి స్థానంలో ఆయన కుమారుడు స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అందాయి. త్వరలో జరిగే ఎన్నికల ఫలితాలు స్టాలిన్‌ను ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది తేలబోతుంది. కరుణానిధి బతికున్నంత వరకూ స్టాలిన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ స్వయం కృషితో ముఖ్యమంత్రి కాగలిగారు.
తెలంగాణలోనూ తాజాగా కేసీఆర్ తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత కేటీఆర్ నే సీఎం అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు తన వారసుడిని ఫోకస్ చేయాలని నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టారు. పార్టీలో తన తర్వాత స్థానాన్ని చంద్రబాబు కల్పించారు.
దేశంలో నెహ్రూ కుటుంబం.. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ప్రస్తుతానికి బలంగా ఉన్నాయి. ఈ వారసత్వ రాజకీయాలపై ‘రామ్’గారి మార్క్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.