Mamata Banerjee and CM KCR Politics: మమతా, కేసీఆర్ ల మధ్య ఎన్నో పోలికలు

Analysis on Mamata Banerjee and CM KCR Politics : కేసీఆర్ వ్యూహం ఏమై ఉంటుంది. ఎందుకు ఇంత దూకుడుగా వెళుతున్నారు. కేంద్రంపై ఒంటికాలిపై ఎందుకు లేస్తున్నారు. దానికి అందరూ ‘హుజూరాబాద్’ ఓటమియే బాధించిందని అనిపిస్తోంది. తెలంగాణలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోందని.. తనను ఎదురిస్తుందన్న ఆందోళనే బీజేపీపై కేసీఆర్ దాడికి కారణంగా చెప్పొచ్చు. ఈ క్రమంలోనే బీజేపీని ఓడించగల వ్యూహం ఏంటనేదానిపై కేసీఆర్ శూలశోధన చేశారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లో బీజేపీని […]

Written By: NARESH, Updated On : April 10, 2022 10:10 am
Follow us on

Analysis on Mamata Banerjee and CM KCR Politics : కేసీఆర్ వ్యూహం ఏమై ఉంటుంది. ఎందుకు ఇంత దూకుడుగా వెళుతున్నారు. కేంద్రంపై ఒంటికాలిపై ఎందుకు లేస్తున్నారు. దానికి అందరూ ‘హుజూరాబాద్’ ఓటమియే బాధించిందని అనిపిస్తోంది. తెలంగాణలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతోందని.. తనను ఎదురిస్తుందన్న ఆందోళనే బీజేపీపై కేసీఆర్ దాడికి కారణంగా చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే బీజేపీని ఓడించగల వ్యూహం ఏంటనేదానిపై కేసీఆర్ శూలశోధన చేశారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ లో బీజేపీని చిత్తుగా ఓడించిన మమతా బెనర్జీ పాలసీలను ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే గవర్నర్ తో కయ్యం పెట్టుకున్నారన్న చర్చ సాగుతోంది.

మమత బెనర్జీ కూడా అక్కడి బీజేపీ నియమించిన గవర్నర్ తో చాలా వివాదాలు, విబేధాలు.. తారాస్థాయిలో గొడవలు పెట్టుకున్నారు. అనంతరం పీకే ను నియమించుకొని ఆయన వ్యూహాలతో బీజేపీ బెంగాల్ పై దండయాత్ర చేస్తోందని.. ప్రజలే కాపాడాలని.. బెంగాల్ స్వభిమాన సెంటిమెంట్ ను తట్టి లేపారు.

ఇప్పుడు కేసీఆర్ కూడా అదే అస్త్రం తీయబోతున్నాడని తెలుస్తోంది. తెలంగాణ ప్రజల్లో బీజేపీని విలన్ చేయగలిగితేనే తన విజయం సాధ్యమవుతుందని కేసీఆర్ బలంగా భావిస్తున్నారు. అందుకే బెంగాల్ లో మమత అమలు చేసిన వ్యూహాన్నే తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

బెంగాల్ లో మమత ఏం చేసిందో తెలంగాణలో కేసీఆర్ అవే వ్యూహాలు అమలు చేస్తున్నారు. మొదట గవర్నర్ తమిళిసైతం కయ్యానికి కాలుదువ్వాడు. ఆ తర్వాత ఆమెలాగానే వ్యూహాలు రూపొందించాడు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్లాన్లు ఏమిటీ? ఏం చేయబోతున్నాడన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.