https://oktelugu.com/

New Cabinet: ఆసక్తిని రేపుతున్న క్యాబినెట్ కూర్పు.. ఆ ముగ్గురి వైపే అందరి చూపు..!

AP New Cabinet: సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ను మరోసారి పునర్వవ్యస్థికరించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీ క్యాబినెట్ మరోసారి కొలువుదీరబోతున్న సంగతి అందరికీ తెల్సిందే. ఈక్రమంలోనే మంత్రి వర్గంలోకి ఎవరెవరు కొత్తగా వస్తారు? పాతవారిలో ఎవరికీ జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారనే చర్చ ఏపీలో హాట్ హాట్ గా నడుస్తోంది. మిషన్ 2024 పేరుతో రాబోతున్న ఏపీ కొత్త క్యాబినేట్ పై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అనేక రాజకీయ, కుల సమీకరణాలు, వినయ, విధేయతలు, అనుభవం తదితర […]

Written By: , Updated On : April 10, 2022 / 09:23 AM IST
Follow us on

AP New Cabinet: సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ ను మరోసారి పునర్వవ్యస్థికరించనున్నారు. ఏప్రిల్ 11న ఏపీ క్యాబినెట్ మరోసారి కొలువుదీరబోతున్న సంగతి అందరికీ తెల్సిందే. ఈక్రమంలోనే మంత్రి వర్గంలోకి ఎవరెవరు కొత్తగా వస్తారు? పాతవారిలో ఎవరికీ జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారనే చర్చ ఏపీలో హాట్ హాట్ గా నడుస్తోంది.

Jagan Cabinet Meeting

మిషన్ 2024 పేరుతో రాబోతున్న ఏపీ కొత్త క్యాబినేట్ పై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అనేక రాజకీయ, కుల సమీకరణాలు, వినయ, విధేయతలు, అనుభవం తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏపీ కొత్త క్యాబినేట్ కూర్పు ఉండబోతుంది. అయితే మంత్రివర్గం ప్రమాణ స్వీకారానికి డేట్ దగ్గరపడుతున్న కొద్ది క్యాబినేట్ కూర్పు అనేది రసవత్తరంగా మారుతోంది.

జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులంతా ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే వీరిలో ఎక్కువ మంది మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంకొందరు అసమ్మతి గళం, అలక పాన్పులెక్కడం వంటివి చేస్తున్నారు. ఇక గతంలో మంత్రి పదవీ మిస్ అయిన వారంతా ఈసారి ఎలాగైనా క్యాబినేట్లో బెర్త్ ఖరారు చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండటంతో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పాతవారికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కన్పిస్తోంది. సుమారు ఏడు నుంచి పది మంది కొత్త వారికి రెండోసారి దక్కబోతుందని సమాచారం. దీంతో ఈసారి ఆశావహులకు జగన్మోహన్ రెడ్డి మొండిచేయి చూపించే అవకాశం కన్పిస్తోంది.

వైసీపీలో బడా పొలిటీషయన్ గా గుర్తింపు దక్కించుకున్న పెద్ది రెడ్డి రాంచంద్రారెడ్డి, ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి వీరభక్తుడు కొడాలి నానికి మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం కన్పిస్తోంది. ఇదే విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు సైతం వెల్లడించారు.

పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లేకుంటే తమ పార్టీ లేదన్నారు. ఈ ముగ్గురు లేని క్యాబినేట్ ను తాను ఊహించలేనని చెప్పుకొచ్చారు. ఒకవేళ బోత్సను తప్పిస్తే ఆయన తమ్ముడు బొత్స అప్పల నర్సయ్యకు పదవీ దక్కే అవకాశం కన్పిస్తోంది. పెద్ది రెడ్డిని కాదని రోజాకు జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ ఇస్తారా? అనేది ప్రశ్నగా మారింది.

క్యాబినెట్లో చోటు కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా ప్రత్యర్థి పార్టీలపై ఒంటరిగానే విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది. ఏదిఏమైనా ఈ సాయంత్రానికి జగన్ కొత్త క్యాబినేట్ లిస్టు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.