BRS Party In AP : ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ అనేది ఈ సంవత్సరానికే పెద్ద జోకు. కేసీఆర్ కనుసన్నల్లో ఆంధ్రా రాజకీయాలు జరుగబోతున్నాయట.. వినటానికే ఒక వింతలాగా అనిపిస్తోంది. నిన్నామొన్నటిదాకా.. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతూ.. ఆంధ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ద్వేషాలు రెచ్చగొట్టిన కేసీఆర్ .. ఆంధ్రలో బీఆర్ఎస్ పెట్టి విస్తరించడమే ఇప్పుడు వింతగా మారింది. ఏపీ బీఆర్ఎస్ కు తోట చంద్రశేఖర్, రావెల, వెంకటేశ్, రమేశ్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు లాంటి నేతలు చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఏపీ నేతలందరూ అసలు రాజకీయంగా యాక్టివ్ గా లేరు. జనసేన, బీజేపీలో అసలు వీరి ఉనికి లేదు. ఈ ఐఏఎస్ లు, ఐఆర్ ఎస్ లు హైదరాబాద్ లో ఆస్తులు కూడబెట్టుకున్నారు. వారిని కేసీఆర్ ఈజీగా లొంగదీసుకున్నట్టు సమాచారం. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితుడైన తోట చంద్రశేఖర్ జనసేనలో లేడు. ఆయన జనసేనలో ఉన్నట్టు ఎవరికీ ఓపినయన్ లేదు. అలాంటి నేత జనసేనలో ఉన్నట్టు ప్రొజక్ట్ చేస్తున్నారు.
వాస్తవానికి ఏపీలో రాజకీయాలు నడిపిన యోధానుయోధులు పరిస్థితులు కలిసి రాక ఖాళీగా ఉన్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని సంప్రదిస్తే ఆలోచించి చెబుతామని చెప్పారు దీంతో రాజకీయంగా కుదురుకోలేని తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబును రప్పించి.. బాధ్యతలు అప్పగించి.. ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతానని చూస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు వర్కవుట్ కావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కేసీఆర్ కనుసన్నల్లో ఆంధ్రా రాజకీయాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..