Congress: కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారుతోంది. భవిష్యత్ అంధకారం అవుతోంది. పార్టీ ప్రక్షాళన పేరుతో చేపట్టే కార్యక్రమాలతో ప్రజల్లో చులకన అవుతోంది. పంజాబ్ కాంగ్రెస్ లో చోటుచేసుకున్న పరిణామాలతో చత్తీస్ గడ్, రాజస్థాన్ స్టేట్లలో కూడా ఇదే తరహా పరిస్థితి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్ణార్థకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జి-23 నేతల కనుసన్నల్లో పార్టీ నడుస్తోందని తెలుస్తోంది. వారు ఏది చెబితే అది నిర్ణయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ లో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధిష్టానమే తప్పుదారుల్లో నడుస్తూ తిప్పలు కొనితెచ్చుకుంటోంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ర్ట రాజకీయాల్లో చొరవ చూపుతూ పార్టీని అగాధంలో పడేస్తున్నారు. ఫలితంగా రాబోయే ఎన్నికల్లో ఎదురుదెబ్బలే తగిలే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ను మార్చడంతో పార్టీ కష్టాల్లో పడింది. అసలు అక్కడ అమరీందర్ ఇమేజ్ తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి మరచి ప్రస్తుతం ఆయనను తప్పించి పెద్ద తప్పిదమే చేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారం రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సోనియాగాంధీకి వీర విధేయుడైన అమరీందర్ను మార్చడంలో కాంగ్రెస్ నష్టాలనే మూటగట్టుకుందని తెలుస్తోంది. దీంతో చత్తీస్ గడ్, రాజస్థాన్ లలో కూడా నాయకత్వం మార్చాలని ఒత్తిడులు వస్తున్న క్రమంలో అధిష్టానం అలా చేస్తే కష్టాలు తప్పవని తెలుసుకుంటోంది. దీంతో వారి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెబుతోంది. రాజస్థాన్ లో సీఎం అశోక్ సింగ్ గెహ్లాట్ కు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ కు పొసగడం లేదు. అక్కడ కూడా ముఖ్యమంత్రులను మార్చాలని డిమాండ్ వస్తున్నా నేతలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది.
దీంతో కొత్త ప్రయోగాలకు వెళితే మొదటికే మోసం వస్తుందని భావిస్తోంది. ఉన్న పళంగా నాయకత్వాన్ని మార్చితే రాబోయే ఎన్నికల్లో పార్టీ పీకల్లోతు కష్టాల్లో పడుతుందని అభిప్రాయపడుతోంది. అందుకే స్థానిక నేతలకు పెత్తనం ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. పార్టీని ఎలాగైనా అధికారంలో కి తీసుకొచ్చే క్రమంలో మార్పులకు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.