Analysis on 8 Years of Jansena: జనసేన 9వ ఆవిర్భావ సభ చారిత్రాత్మకంగా చెప్పొచ్చు. 2014 నుంచి 2022కి ఎంత మార్పునో ఈ సభ తేటతెల్లం చేసింది. 2014లో హైదరాబాద్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మొదటి జనసేన ప్రకటన నుంచి 2022లో ఇప్పటంలో జరిగిన 9వ ఆవిర్భావ సభకు ఎక్కడా పొంతన లేదు.
పవన్ లక్ష్యాలు, గమ్యం అదే. కానీ ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 2014లో ఎన్నికలకే దిగని జనసేన.. 2022లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు యుద్ధభేరి మోగించిన జనసేన..ఇదే తేడాగా చెప్పొచ్చు. 2014లో కేవలం 100 మంది కూడా పవన్ వెంట లేరు. కానీ నిన్నటి సభలో ఏకంగా 5 లక్షల మంది జనం.. వందల మంది నాయకుల గణం పవన్ వెంట ఉన్నారు. ఎంత మార్పు? ఎంత సాధించారో దీన్ని బట్టి జనసేన ప్రగతిని అంచనా వేయవచ్చు
2014లో కేవలం 150మంది క్రియాశీల సభ్యులతో జనసేన ప్రారంభమైంది.ఇప్పుడు 3.20 లక్షల మంది జనసేన నేతలతో అత్యంత పటిష్టంగా జనసేన తయారైంది. అతి త్వరలోనే 5 లక్షల క్రియాశీల సభ్యత్వం దిశగా సాగుతోంది. 2014లో ఆరుగురు మాత్రమే కార్యవర్గ సభ్యులున్నారు. ఈరోజు 76 కార్యవర్గ సభ్యులు, జిల్లాలు, మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు.. ఈరోజు పూర్తి నిర్మాణ స్వరూపాన్ని సంతరించుకున్న జనసేన గొప్పగా ఎదిగింది.
నిన్న జరుపుకున్న జనసేన సభ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. వందలాది మంది నేతలను, లక్షల మంది జనాలను మెయింటేన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ సభను నిర్వహించిన తీరు జనసేన పరిపూర్ణ రాజకీయ పార్టీగా ఎదిగిందని చెప్పొచ్చు. దీన్ని బట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారానికి దగ్గరలో ఉన్నారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి రాగలరా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.