సొంత అక్కే చెల్లెలి జీవితాన్ని చిదిమేసింది. అండగా ఉండాల్సిన సోదరే అంతమొందించింది. తోబుట్టువే తోడేళ్లలాగా మారి తన జీవితాన్ని తుదముట్టించింది. మాట వినలేదనే నెపంతో నూరేళ్ల జీవితాన్ని బుగ్గి పాలు చేసింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో అక్కలు రాఖీ దేవి, రూపాదేవిల వద్ద బాలిక ఉంటోంది. ఈ క్రమంలో రాఖీదేవి జార్ఖండ్ లో వ్యభిచారం నిర్వహిస్తోంది. దీంతో చెల్లెలిని కూడా అందులో దింపాలని పథకం వేసింది. దీంతో దీనికి బాలిక ససేమిరా అంది. వ్యభిచార కూపంలోకి తనను లాగొద్దని వేడుకుంది.

కాగా పెద్ద చెల్లిని కూడా అందులో భాగస్వామిని చేసిన రాఖీదేవి చిన్న దాన్ని కూడా అందులోనే ఉంచాలని భావించింది. కానీ బాలిక తనకు ఇష్టం లేదని చెప్పినా వినిపించుకోలేదు. ఆమెను పలువురి విటుల వద్దకు పంపుతూ నరకం చూపించింది. ఈనేపథ్యంలో వ్యభిచారంలో ఇమడలేక బాలిక అక్కడి నుంచి బయట పడాలని ప్లాన్ వేసింది. తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. దీంతో రాఖీ దేవి బాలికను తుదముట్టించాలని పథకం రచించింది.
ప్రేమికుడి మాయలో పడి ఎక్కడ దూరమవుతుందో అని అనుకున్న అక్క బాలికను ప్రతాప్, నితేష్ లతో పలుమార్లు లైంగిక దాడికి యత్నించారు. చివరకు ఉరివేసి హత్య చేశారు. ఇంట్లో ఎవరు లేని సమయంలో శవాన్ని ఆటోలో వేసుకుని ఓ నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వచ్చారు. పోలీసు కేసు కూడా నమోదు చేయలేదు. దీంతో పోలీసులు బాలిక శవాన్ని ఆరా తీయగా వివరాలు తెలిశాయి.
సొంత అక్కే సోదరి మృతికి కారణం కావడం చర్చనీయాంశం అయింది. మానవ సంబంధాలు గాల్లో కలుస్తున్నాయనడానికి ఇదే తార్కాణం. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో ఇంకా అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.