Water: మన శరీరానికి నీళ్లు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహారం లేకపోయినా జీవించడం సాధ్యం కానీ నీళ్లు లేకపోతే జీవనం సాగించడం తేలిక కాదనే సంగతి తెలిసిందే. శరీరానికి తగినన్ని నీళ్లు తాగితే మాత్రమే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. అయితే మనలో చాలామంది నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు మాత్రం నిలబడి నీళ్లు తాగడం ఆరోగ్యకరం కాదని చెబుతున్నారు.
కుర్చీపై కూర్చొని వెన్ను భాగంను నిటారుగా ఉంచి నీళ్లు (Water)తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా చేస్తే మెదడు పనితీరు మెరుగుపడటంతో పాటు మెదడుకు అవసరమైన పోషకాలు అందే ఛాన్స్ ఉంటుంది. మనం కూర్చున్న సమయంలో కిడ్నీల పనితీరు బాగుంటుందని పలు నివేదికలలో తేలింది. నిలబడి నీళ్లు తాగితే వడపోత లేకుండా నీళ్లు దిగువపొట్టకు చేరే అవకాశం అయితే ఉంటుంది.
నీటి మలినాల వల్ల కిడ్నీ పనితీరు దెబ్బ తినడంతో పాటు మూత్ర నాళాల రుగ్మతలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు చేరవు. నిలబడి నీళ్లు తాగడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు చెదిరిపోయి గుండె పనితీరు ప్రమాదంలో పడే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిలబడి నీళ్లు తాగితే నరాల సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
నిలబడి నీళ్లు తాగడం వల్ల ద్రవాల సమతుల్యత దెబ్బ తింటుంది. నిలబడి నీళ్లు తాగితే కీళ్లలో ద్రవాలు పేరుకుపోయి ఆర్థరైటిస్, ఇతర సమస్యలు వస్తాయి. నిలబడి నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థపై ఎఫెక్ట్ పడి పొత్తికడుపుపై ప్రభావం పడటంతో పాటు శరీరంలో ట్యాక్సిన్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది.
Also Read: బంక్ లో పెట్రోల్ కి బదులు నీళ్లు