
ఎపిపై వచ్చే ఆదాయం రాకపోగా 13 వేల కోట్ల అదనపు భారం పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రంలో వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
ఎపిలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం దాదాపు రూ. 6 వేల కోట్ల నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనాని, వాస్తవంగా దీని కంటే ఎక్కువే రాబడిని ప్రభుత్వం కోల్పోయిందని అధికార వర్గాల సమాచారం. జనతా కర్ఫ్యూ మొదలైన మార్చి 22 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే 3వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ నెల 20 నుంచి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
దీనికి తోడు కరోనా వ్యాప్తి నిరోధించడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన పేదలకు సాయం చేయడానికి కాని, కరోనా నేపద్యంలో పేదలకు వెయ్యి రూపాయల పంపిణీ రూ. 1,300 కోట్లను 1.30 కోట్లమందికి అందజేశారు. అదనపు రేషన్ పంపిణీకి మరికొన్ని నిధులను వెచ్చించిండం కూడా అదనపు భారంగా మారాయి. కరోనా వైరస్ భరినపడిన వారికి వైద్యం, కరోనా లక్షణాలు గల వారిని క్వారంటైన్ లో ఉంచి సేవలు, ఆహారం అదిస్తున్నందుకు,
కరోనా నియంత్రణకు అయిన వ్యయం రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు ఇంకా పెరుగుతూ ఉంటుందని, ఎక్కడ ఆగుతుందనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఈ ఖర్చులన్నీ కలిపి ఇప్పటి వరకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఊహించని భారం ప్రభుత్వంపై పడిందనేది వాస్తవం.
మరోవైపు కేంద్రం కొన్ని పధకాల కింద నిధులను విడుదల చేయడం రాష్ట్రానికి కొంత ఊరట. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోయినా కరోనా నేపధ్యంలో స్థానిక సంస్థల అభివృద్ధి నిధులు మార్చి 21న రూ.1,301 కోట్లు, ఏప్రిల్ మొదటి వారంలో రెవెన్యూ లోటు సర్దుబాటుకు రూ.491.41 కోట్లు, జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.559.50 కోట్లను కేంద్ర అందజేసింది.