రాజకీయ దుమారం రేపిన యుపి విద్యార్థుల తరలింపు

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, అంతర్ రాష్ట్ర కదలికలపై నిషేధం అమలులో ఉన్న రోజులలో రాజస్థాన్ లోని కోట కోచింగ్ కేంద్రాలలో శిక్షణ పొందుతూ, కరోనా కారణంగా అక్కడి హాస్టల్స్ లలో చిక్కుకు పోయిన తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను రప్పించే ప్రయత్నం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేయడం రాజకీయ దుమారం రేపుతున్నది. అక్కడ చిక్కుకు పోయిన సుమారు 7,000 మంది విద్యార్థులను రప్పించడం కోసం యోగి 300 బస్సు లను పంపించారు. ప్రధాని […]

Written By: Neelambaram, Updated On : April 19, 2020 12:50 pm
Follow us on


లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, అంతర్ రాష్ట్ర కదలికలపై నిషేధం అమలులో ఉన్న రోజులలో రాజస్థాన్ లోని కోట కోచింగ్ కేంద్రాలలో శిక్షణ పొందుతూ, కరోనా కారణంగా అక్కడి హాస్టల్స్ లలో చిక్కుకు పోయిన తమ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను రప్పించే ప్రయత్నం యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేయడం రాజకీయ దుమారం రేపుతున్నది.

అక్కడ చిక్కుకు పోయిన సుమారు 7,000 మంది విద్యార్థులను రప్పించడం కోసం యోగి 300 బస్సు లను పంపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన లాక్ డౌన్ ను ఆయన పార్టీకి చెందిన ముఖ్యమంత్రియే ధిక్కరించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చివరకు కొందరు బిజెపి నేతలు సహితం ఈ విషయమై పెదవి విరుస్తున్నారు. తన రాష్ట్ర ప్రయోజనాలకోసం యోగి ధిక్కార ధోరణి ప్రదర్శించారని మాటలు వినబడుతున్నాయి.

మరోవంక ఈ అంశం పొరుగున ఉన్న బీహార్ లో రాజకీయ కలకలం రేపింది. వలస కారకులను గాలికి వదిలి వేసి విద్యార్థుల కోసం బస్సులను పంపడం లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధమని, అన్యాయమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విమర్శలు గుప్పించారు.

బీహార్ లో ప్రతిపక్ష నేత, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ మాత్రం ఈ విషయమై నితీష్ ను తప్పుబట్టారు. యోగి తరహాలో నితీష్ కూడా బస్సులను పంపి బీహార్ విద్యార్థులను వెనుకకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు.

అయితే తేజస్వి మిత్రపక్షం కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో నితీష్ కు బాసటగా నిలిచింది. లాక్‌డౌన్ సమయంలో విద్యార్థులను తరలించకుండా ఉండడమే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, పార్టీ జాతీయ ప్రతినిధి ప్రేంచంద్ర మిశ్రా స్పష్టం చేశారు.

మరోవంక ఈ విషయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహితం యోగికి బాసటగా నిలిచారు. ఇతర ముఖ్యమంత్రులు తమ రాష్ట్రానికి చెందిన వారిని రప్పించుకోవడం కోసం ఏదో చేస్తుంటే ఇంట్లో కూర్చొని నితీష్ కుమార్ లాక్ డౌన్ సూత్రాలను వాళ్ళన్నారని ఎద్దేవా చేశారు.

దేశంలో పలు చోట్ల చిక్కుకు పోయిన బీహార్ ప్రజలను రప్పించడం కోసం కనీసం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడలేదని తప్పుపట్టారు.