‘అంఫాన్’ ఇది వైరస్ కాదు..!

ఒక పక్క కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి రాష్ట్రాన్ని చేస్తోంటే, మరో పక్క వాతావరణం రాష్ట్రానికి మరో ముప్పును తీసుకొస్తోంది. కరోనా కట్టడి కోసం అధికారులు నిద్రాహారాలు మానేసి పని చేస్తున్నా, డాక్టర్లు అధికారులు సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నా వైరస్ ఒక్క విజయనగరం జిల్లా మినహా అన్ని జిల్లాలకు పాకింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మరో ఉపద్రవం పొంచి ఉంది. అదే అంఫాన్. విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా? ఇది […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 1:25 pm
Follow us on


ఒక పక్క కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి రాష్ట్రాన్ని చేస్తోంటే, మరో పక్క వాతావరణం రాష్ట్రానికి మరో ముప్పును తీసుకొస్తోంది. కరోనా కట్టడి కోసం అధికారులు నిద్రాహారాలు మానేసి పని చేస్తున్నా, డాక్టర్లు అధికారులు సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నా వైరస్ ఒక్క విజయనగరం జిల్లా మినహా అన్ని జిల్లాలకు పాకింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి మరో ఉపద్రవం పొంచి ఉంది. అదే అంఫాన్.

విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?

ఇది మరో రకం వైరస్ కాదు. రానున్న వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ను తాకనున్న తుఫాన్ పేరు. ఇది రాష్ట్రంపై పెద్ద ఎత్తున విరుచుకు పడనున్నదని ఇప్పటికే డిల్లీ కి చెందిన రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రోలాజికల్ సెంటర్ ప్రత్యేక వాతావరణ కేంద్రం – ఉష్ణమండల తుఫానుల విభాగం ధృవీకరించింది.

అలిగిన అఖిల ప్రియ… తమ్ముడి కోసం టిడిపికి దూరంగా!

మే 7 తర్వాత ఏ సమయంలో అయినా ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ ని తాకే ప్రమాదం ఉంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలు అటు ఒరిస్సా రాష్ట్రం ఈ తుఫాను బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని తెలియటంతో ప్రభుత్వ అధికారులు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి రాకుండా తుఫాను సహాయ కార్యక్రమాలు ఎలా చేయాలో ఇప్పటినుంచే అధికారులు వ్యూహం రచిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కరోనా తీవ్రత లేని ప్రాంతంగా ఉన్న ఉత్తర ఆంధ్ర జిల్లాలు ఈ తుఫాన్ ను ఎదుర్కొనెందుకు అక్కడి అధికారులు సిద్ధమవుతున్నారు.