Amith Shaw – RRR : షాక్… ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో అమిత్ షా పార్టీ రద్దు!

Shock : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని అభినందించేందుకు అమిత్ షా హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాద్ వస్తున్నారు. చేవెళ్ల లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇదే రోజు ఆయన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని కలవాల్సి […]

Written By: Shiva, Updated On : April 23, 2023 10:16 am
Follow us on

Shock : ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని అభినందించేందుకు అమిత్ షా హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అమిత్ షా ఏప్రిల్ 23న హైదరాబాద్ వస్తున్నారు. చేవెళ్ల లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇదే రోజు ఆయన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని కలవాల్సి ఉంది. ఆస్కార్ గెలిచి దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్ తో పాటు యూనిట్ సభ్యులను అభినందించాల్సి ఉంది.

అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దయినట్లు తెలుస్తుంది. నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన వేడుకను క్యాన్సిల్ చేశారట. అమిత్ షా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా చేవెళ్ల సభకు హాజరవుతారట. అలాగే కోర్ కమిటీ సభ్యులతో భేటీ కానున్నారట. బిజీ షెడ్యూల్స్ రీత్యా అనుకున్న ప్రకారం ఆర్ ఆర్ ఆర్ టీమ్ అభినందన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనే అవకాశం లేదని సమాచారం అందుతుంది.

2023 మార్చి 12న లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డు గెలుచుకుంది. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ఆర్ ఆర్ ఆర్ చరిత్రకు ఎక్కింది. నాటు నాటు సాంగ్ కి సంగీతం సమకూర్చిన కీరవాణి, సాహిత్యం అందించిన చంద్రబోస్ వేదికపైకి వెళ్లి అవార్డు అందుకున్నారు. కీరవాణి తన ఆనందం ప్రపంచ సినిమా వేదిక మీద పంచుకున్నారు.

నాటు నాటు సాంగ్ ని కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డుల వేడుకలో పాడటం మరో అరుదైన విషయం. మొత్తం రాజమౌళి అసాధ్యం అనుకున్న ఆస్కార్ గెలిచి చూపించారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ ఫేమ్ రాబట్టారు. ఈ ఇద్దరు హీరోల పేర్లు అంతర్జాతీయ సినిమా పత్రికల్లో మారుమ్రోగాయి. రామ్ చరణ్ అయితే గుడ్ మార్నింగ్ అమెరికా షోకి అతిథిగా హాజరయ్యాడు. ఈ గౌరవం అందుకున్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా రికార్డులకు ఎక్కాడు.