విస్తరణ వాదంతో పక్కదేశాలను కబళించడానికి చైనా రెడీ అవుతోంది. భారత్ తోపాటు దక్షిణ చైనా పక్కనున్న దేశాలతోనూ కయ్యానికి కాలుదూస్తోంది. . అమెరికా టెక్నాలజీని తస్కరించే చైనా ఎదిగిందనేది కాదనలేని సత్యం. అమెరికా ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ ఫోన్ల తయారీ జరిగేది చైనాలోనే. అమెరికా టెక్నాలజీని కొల్లగొట్టి ఇప్పుడు చైనా మొబైల్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా చీప్ గా మొబైల్స్ ను ఉత్పత్తి చేస్తున్నాయి.
Also Read: అమెరికాలో భారతీయ ఓటర్ల మద్దతు ట్రంప్‌కేనా..?
అమెరికా కనిపెట్టడం.. చైనా దాన్ని తెలివిగా తస్కరించడం.. చీప్ గా తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ను చేజిక్కించుకోవడం.. ఇన్నాళ్లు చేస్తోంది ఇదే.. ఇప్పుడు కూడా అదే పనిలో చైనా ఉందనే అనుమానాలు లేకపోలేదు. ఈ క్రమంలోనే అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా దాదాపు వెయ్యిమందికి పైగా చైనీస్ విద్యార్థులు, పరిశోధకుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా హోం ల్యాండ్ సెక్యురిటీ విభాగం బుధవారం వెల్లడించింది. ఈ 1000మంది చైనా వారు చైనా మిలిటరీతో సంబంధాలు కలిగి ఉన్నారని.. అమెరికాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని డ్రాగన్ ఆర్మీకి పంపిస్తున్నారనే అనుమానంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా తెలిపింది.
కరోనా వైరస్ పరిశోధనకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించే ప్రయత్నాలు కొందరు చైనీయులు చేస్తున్నారని అమెరికా హోలాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి తెలిపారు. చైనా దేశవిద్యార్థులు, పరిశోధకుల నుంచి అమెరికా డేటాకు ముప్పు పొంచి ఉందని.. ఇకపై వారు తమ దేశంలో ప్రవేశించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇక చైనా వస్తువులను తమ దేశ మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటామని.. జిన్ జియాంగ్ లోని ఉగర్ ముస్లింల పట్ల చైనా అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నట్టు అమెరికా తెలిపింది.
Also Read: చైనా బరితెగింపు వెనుక అసలు కారణమేంటి?
చైనా ఇన్నాళ్లు అమెరికాలో చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆ దేశం ఆర్థికంగా ఎదిగింది. ఇప్పటికే నలుగురు చైనా పరిశోధకులను అమెరికా అరెస్ట్ చేసింది. వీరంతా డేటా కొల్లగొట్టి చైనాకు చేరవేస్తున్నారని తేలింది. ఇంకా ఎంతమంది చైనీయులు అమెరికాలో ఇలా గూఢచర్యం చేస్తున్నారో తెలియదు. సో ఇప్పుడు అమెరికా చర్యల వల్ల ఆ దేశంలో చదువుకుంటున్న దాదాపు 3.60 లక్షలమంది చైనీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. అమెరికా-చైనా వార్ తో ఇప్పుడు చాలా మంది జీవితాలు రోడ్డున పడే ప్రమాదం ఏర్పడుతోంది.