https://oktelugu.com/

Ambati Rambabu Dance : ఈ సంక్రాంతి డ్యాన్సర్ అంబటి రాంబాబునే.. ఇరగదీసిండు పో.. వీడియో చూస్తే తట్టుకోలేరు

Ambati Rambabu Dance  : మామూలుగా సంక్రాంతికి కోడిపందాలు జరుగుతాయి. ఆంధ్రాలో అసలు సిసలు పండుగ ఇదీ.. కోడిపందాలు.. బెట్టింగులు.. కొత్త అల్లుళ్లు.. మందు విందు.. చిందులు, రికార్డింగ్ డ్యాన్సులు అబ్బో చెప్పడానికి చాలా ఉంటుంది. అందుకే హైదరాబాద్ సహా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా ఈ సంక్రాంతికి ఏపీకి వచ్చేస్తారు. అక్కడ అంతా ఘనంగా జరుపుకుంటారు. ఏపీలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సొంతూరు నారావారి పల్లెకు […]

Written By:
  • NARESH
  • , Updated On : January 14, 2023 / 06:04 PM IST
    Follow us on

    Ambati Rambabu Dance  : మామూలుగా సంక్రాంతికి కోడిపందాలు జరుగుతాయి. ఆంధ్రాలో అసలు సిసలు పండుగ ఇదీ.. కోడిపందాలు.. బెట్టింగులు.. కొత్త అల్లుళ్లు.. మందు విందు.. చిందులు, రికార్డింగ్ డ్యాన్సులు అబ్బో చెప్పడానికి చాలా ఉంటుంది. అందుకే హైదరాబాద్ సహా ఎక్కడెక్కడ ఉన్న వారంతా కూడా ఈ సంక్రాంతికి ఏపీకి వచ్చేస్తారు. అక్కడ అంతా ఘనంగా జరుపుకుంటారు.

    ఏపీలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సొంతూరు నారావారి పల్లెకు వచ్చాడు. ఆయన బావ మరిది బాలయ్య బాబు సహా ఫ్యామిలీ అంతా సొంత ఊళ్లోనే పండుగ జరుపుకోవడానికి సిద్ధమయ్యారు.

    తెల్లవారుజాము నుంచే భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులతో ప్రజలు వేడుకలను జరుపుకుంటున్నారు.

    తాజాగా సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి మంటల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు తెగ సందడి చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ లో ‘సంబరాల రాంబాబు’ అని ఏ మూహార్తాన అన్నాడో కానీ అచ్చం అలానే… అంతకుమించిన డ్యాన్సులతో ఇరగదీశాడు..

    అప్పట్లో అంబటి రాంబాబు పలు సినిమాల్లోనూ నటించాడని టాక్. ఈ మధ్య మొత్తం నల్ల జుట్టును వదిలేయడంతో తెల్లగా మారిపోయింది. రంగేసుకున్నాడని అర్థమైది. అయితే తాజాగా సత్తెన పల్లిలో అంబటి రాంబాబు భోగి మంటలు వేసి గిరిజనులతో కలిసి చిరంజీవి స్టైల్లో వేసిన స్టెప్పులు ఉర్రూతలూగించాయి. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంబటి రాంబాబు డ్యాన్సుల వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి..