Palki Sharma Upadhyay: మారుతున్న కాలంతో పాటే జర్నలిజం కూడా మారిపోయింది. న్యూట్రాలిజంగా ఉండాల్సింది పోయి డప్పు కొట్టేందుకు అలవాటు పడింది.. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు మౌత్ పీస్ లు ఉన్నాయి. మౌత్ పేపర్లు కూడా ఉన్నాయి.. సో జర్నలిజం అనేది తన టెంపర్ మెంట్ కోల్పోయి చాలా సంవత్సరాలయింది.. ఇందులో విలువలు, వలవల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. పెద్దపెద్ద కార్పొరేట్ దిగ్గజాలు మీడియా వ్యాపారం లోకి వస్తున్నాయి.. కాబట్టి మీడియా నుంచి కూడా న్యూట్రాలిటీ ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, అమ్ముడుపోయిన మీడియా వ్యవస్థల్లో కొంతమంది పాత్రికేయులు నిజంగా తమ టెంపర్ మెంట్ కోల్పోలేదు. తమ వ్యక్తిత్వాన్ని ఎక్కడ తగ్గనీయలేదు. రిపోర్టింగ్, వ్యాఖ్యానం, విశ్లేషణ ఇలా ఏదైనా కానీయండి.. వాళ్ల బ్రాండ్ చూపించారు. చూపిస్తూనే ఉన్నారు.
రాజస్థాన్లో పుట్టి..
అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేది పాల్కి శర్మ ఉపాధ్యాయ్. వయసు జస్ట్ నలభై ఏళ్ల లోపే. వృత్తి న్యూస్ ప్రజెంటర్. నిన్న మొన్నటిదాకా నిష్పక్షపాతమైన జర్నలిస్టు గానే అందరికీ తెలుసు.. కానీ నిన్నటి నుంచి ఆమె ఒక నేషనల్ సెలబ్రిటీ అయిపోయారు. ఆమె త్వరలో ఎన్డి టీవీ ఎడిటోరియల్ చీఫ్ నియమితులు కాబోతున్నారు. కానీ ఆమె కోసం మూడు ప్రధాన మీడియా సంస్థలు బలంగా పోరాడుతున్నాయి. ఈ విషయం ఏకంగా కోర్టు దాకా వెళ్ళింది. పాల్కి శర్మ పుట్టింది రాజస్థాన్ లో. మొదట్లో ఆమె దూరదర్శన్లో చేసేది.. తర్వాత సీఎన్ఎన్ ఐబీఎన్ లో చేరింది. అందులో చాలా సంవత్సరాలు పని చేసింది. భర్త సంకేత్.. ఆయన కూడా జర్నలిస్టే. అయితే పాల్కి కి మంచి న్యూస్ ప్రజెంటర్ గా పేరుంది. స్పష్టమైన ఆధారాలతో, ఎటువైపూ మొగ్గు చూపకుండా న్యూస్ ప్రజెంట్ చేస్తుందని ఆమెకు పేరు ఉంది.. ఇప్పుడు దేశంలో కెల్లా ఆమె ఇప్పుడు టాప్ న్యూస్ ప్రజెంటర్. సీ ఎన్ఎన్ ఐబీఎన్ తర్వాత వియాన్ లో చేరింది. ఈ వియాన్ ఎస్ఎల్ గ్రూప్ నకు చెందినది. ఈ గ్రూప్ మరెవరిదో కాదు. జీ మీడియా సుభాష్ ది.
ఆయన బిజెపి మాజీ ఎంపీ. వియాన్ లో మేనేజింగ్ ఎడిటర్ గా చేరిన తర్వాత పాల్కి గ్రావిటాస్ అనే ప్రోగ్రాం తో జనంలోకి విస్తృతంగా వెళ్లేది.. న్యూట్రల్ గానే ఉండేది. అర్నబ్ గోస్వామి అరుస్తాడు. ఎగిరి పడతాడు. ఆవేశపడతాడు. తన సొంత భావాలను ప్రయత్నం చేస్తాడు. కానీ పాల్కి అలా కాదు.. నిదానంగా ఉంటుంది.. చెప్పేది సావధానంగా వింటుంది. విషయం ఏమిటో చూసే ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరిస్తుంది. ఎలాంటి అభిప్రాయం ఏర్పరుచుకోవాలో ప్రేక్షకులకే వదిలేస్తుంది. ఇదిగో ఈ లక్షణాలే ఆమెను దేశంలో కెల్లా టాప్ న్యూస్ ప్రజెంటర్ ను చేశాయి..
కారణాలు తెలియదు కానీ ఆమె జి గ్రూప్ నుంచి బయటకు వచ్చింది. కానీ దీనికి ఆ సంస్థ ఒప్పుకోలేదు. పైగా ముఖేష్ అంబానికి చెందిన నెట్వర్క్ 18 లో చేరుతుందనే ఊహగానాలు వినిపించాయి.. ఈ విషయం తెలుసుకున్న జి గ్రూప్ కోర్టు మెట్లు ఎక్కింది. లేదా తనకు కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.. ఎందుకంటే ఆమె అంబానీ గ్రూపులోకి వెళ్ళిపోతే… తమ సంస్థకు చెందిన విషయాలు మొత్తం అక్కడ లీక్ అవుతాయని వాదించింది.
ఇప్పుడు ఎన్డీ టీవీ లోకి
అదానీ మొత్తం ఎన్డీ టీవీ పగ్గాలు చేక్కించుకున్న తర్వాత… ప్రణయ్ రాయ్, రాధికారాయ్, ఎడిటోరియల్ టీంను లీడ్ చేసే రవీష్ కుమార్ రాజీనామా చేశారు. సో ఇప్పుడు ఆదాని ఛానల్ కి ఎడిటోరియల్ చీఫ్ కావాలి. ఎలాగూ శర్మ భర్త ఇదే చానల్ లో కన్సల్టింగ్ ఎడిటర్ గా ఉన్నాడు. సో అంబానీ, సుభాష్ కొట్టుకుంటే శర్మను అదానీ రిసీవ్ చేసుకున్నాడు.