Amaravati Lesson: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారు మొండివైఖరి అవలంభిస్తోంది. మూడు రాజధానులకు జగన్ సర్కారు నిర్ణయించడంతో అమరావతి ముద్ర కనిపించకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటోంది. అమరావతి చరిత్ర కనిపించకుండా ఉండాలని భావిస్తోంది. అమరావతి పేరు కనిపించకుండా చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాఠ్యపుస్తకాల్లో పొందుపరచిన అమరావతి పాఠ్యాంశం ఉండకూడదని దాని స్థానంలో కొత్త పుస్తకం అందుబాటులోకి తేనుంది.

అమరావతి చరిత్రను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఉన్న పుస్తకాలను పక్కన పెట్టేసి నూతన పుస్తకాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమరావతి ఉన్న పుస్తకాన్ని రద్దు చేసింది. అమరావతి చరిత్రను ప్రజలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయితే ఇప్పటికే పుస్తకాలు విద్యార్థులకు చేరిపోవడం ఉపాధ్యాయులు బోధించడం కూడా జరిగిపోయింది. అయినా అర్థంతరంగా ఇలా పుస్తకాలు మార్చడంతో అందరిలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో అమరావతి పేరు కనిపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవర్తించడం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పాత పుస్తకాలను తిరిగి తీసుకుని కొత్త పుస్తకాలతోనే చదువుకోవాలని సూచిస్తోంది.
అమరావతి చరిత్రను తెలుసుకుంటే నష్టం ప్రభుత్వానికి ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. చారిత్రక ప్రదేశం విశిష్టతను ప్రపంచానికి తెలియజెప్పేందుకే ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది. కానీ వైసీపీ మాత్రం అందుకు విరద్దంగా ప్రవర్తించడంపై అనుమానాలు వస్తున్నాయి. మరీ ఇంత దారుణంగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.