Glimpse of Ghani: వరుణ్ తేజ్ ‘గని’ పంచ్ ఇచ్చాడే?

Glimpse of Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ ‘పంచులు’ కురిపించేందుకు రెడీ అయ్యారు. చడీచప్పుడు కాకుండా తన సినిమాను పూర్తి చేయడమే కాదు.. ఏకంగా రిలీజ్ కు రెడీ చేయడం విశేషం. వరుణ్ తేజ్ హీరో అల్లు అరవింద్ సమర్పణలో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ […]

Written By: NARESH, Updated On : October 6, 2021 5:26 pm
Follow us on

Glimpse of Ghani: మెగా హీరో వరుణ్ తేజ్ ‘పంచులు’ కురిపించేందుకు రెడీ అయ్యారు. చడీచప్పుడు కాకుండా తన సినిమాను పూర్తి చేయడమే కాదు.. ఏకంగా రిలీజ్ కు రెడీ చేయడం విశేషం. వరుణ్ తేజ్ హీరో అల్లు అరవింద్ సమర్పణలో కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో అల్లు అర‌వింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మాతగా మారబోతున్నాడు. సిద్దు అనే మరో నిర్మాతతో కలిసి బాబీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ‘గ్లింప్స్’ విడుదల చేసి ప్రకటించారు.

‘గని’ మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ అనే పేరుతో చిన్న టీజర్ ను విడుదల చేశారు. టీజర్ లో వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ ను రివీల్ చేశారు. కండలు తిరిగిన దేహాన్ని వెనుక నుంచి చూపిస్తూ రక్తం కారుతున్న ముఖాన్ని చూపించి ఆఖరుకు వరుణ్ తేజ్ పంచ్ ఇచ్చిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఆ మధ్య వదిలిన ఓ పోస్టర్ లో కూడా వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపించాడు.

బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందన్నది వేచిచూడాలి.

‘గని’ గ్లింప్స్ ను కింద చూడొచ్చు.