రంగస్థలం, వెండితెరపై మెరుస్తున్న నయాతార పునర్నవి భూపాలం. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో కూల్‌గా, క్యూట్‌గా ముద్దుముద్దు పలుకులతో ఆకట్టుకున్న ఈ తార, హీరోయిన్‌గానూ పలు అవకాశాలను అందిపుచ్చుకుంది. బిగ్ బాస్–3 కంటెస్టెంట్‌గా (Bigg Boss Beauty) పాపులరైంది.

నటన లోనే కాకుండా చదువులో కూడా ఒక అడుగు ముందే ఉంటుంది పునర్ణవి భూపాలం. సైకాలజీ, జర్నలిజం లో డిగ్రీ పట్టా పొందింది. కొద్దిరోజులు చదువుకి విరామం ఇచ్చి ఇండస్ట్రీలో లో బాగా బిజీ అయ్యింది. ఇప్పుడు చదువుని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేసిన పున్ను ఇప్పుడు మాస్టర్స్ కూడా పూర్తి చెయ్యాలని అనుకుంటుంది. దానికోసం లండన్ కూడా వెళ్ళింది.
ప్రస్తుతానికి పునర్నవి భూపాళం ‘రాయల్ సెంట్రల్ స్కూల్’ లో థియేటర్, డ్రామా, నటనకి సంబంధించిన కోర్సులని అభ్యసిస్తుంది. తన స్నేహితురాలు వితిక చెప్పినట్టు ఎప్పటికప్పుడు లండన్ అందాలని బందిస్తూ వీడియోలు, ఫోటోల రూపం లో సామజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్య కొత్తగా తన పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంబించింది పున్ను. కుదిరినప్పుడల్లా వ్లాగ్స్ షూట్ చేస్తూ తన యూట్యూబ్ ఛానల్ లో పెడుతూ అందరిని అలరిస్తుంది. తాజా గా తన చివరి రోజులు ఇండియా లో ఎలా గడిపింది అన్న దాని మీద ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతే కాకుండా ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉండి లండన్ సోయగాలను తన అకౌంట్ లో పోస్ట్ చూస్తుంది.