అమరావతి భూకుంభకోణం.. బాబుకు జగన్ షాక్

గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అమరావతి పేరిట నడిపిన భూదందాను వైసీపీ ప్రభుత్వం తవ్వితీస్తోంది. ఇప్పటికే దీనిపై వేసిన సిట్ తాజాగా దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సిట్ నివేదిక ఆధారంగా తాజాగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం సంచలనమైంది. అమరావతిలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. Also Read: బాబుకు వయసు బెంగ పట్టుకుందట..? అసైన్డ్ భూములు, ఇతర భూముల క్రయవిక్రయాలపై గత […]

Written By: NARESH, Updated On : September 15, 2020 3:00 pm
Follow us on

గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అమరావతి పేరిట నడిపిన భూదందాను వైసీపీ ప్రభుత్వం తవ్వితీస్తోంది. ఇప్పటికే దీనిపై వేసిన సిట్ తాజాగా దర్యాప్తును పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సిట్ నివేదిక ఆధారంగా తాజాగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం సంచలనమైంది. అమరావతిలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు.

Also Read: బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?

అసైన్డ్ భూములు, ఇతర భూముల క్రయవిక్రయాలపై గత 15 రోజులుగా సిట్ అధికారులు తూళ్లూరులోనే మకాం వేసి పరిశీలించారు. వీఆర్వోలు, సర్వేయర్లతో కలిసి భూముల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. సిట్ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఏసీబీ కేసుతో అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేసిన చంద్రబాబు, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కేసుల తర్వాత అరెస్ట్ లేనన్న చర్చ సాగుతోంది. ఇక నాడు టీడీపీ నేతలతో కుమ్మక్కై.. తప్పుడు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడిన అధికారులు ఇప్పుడు హడలి చస్తున్నారు.

భూ రికార్డులు తారుమాలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే తూళ్లూరు రిటైర్డ్ తహసీల్దార్ సుధీర్ బాబు.. భూములు కొన్న గుమ్మడి సురేస్ లను ఏసీబీ విచారించినట్టు తెలిసింది. సుధీర్ కు మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇద్దరు మాజీ మంత్రుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

Also Read: కరోనా: కాసుల కక్కుర్తి.. ప్రైవేట్ ఆస్పత్రుల పైరవీలు

ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్ తో తమను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారుల్లో వణుకు మొదలైంది. సిట్ దర్యాప్తులో ఏం తేలింది? ఏఏ టీడీపీ ప్రజాప్రతినిధుల జాతకాలు బయటపడ్డాయన్నది ఉత్కంఠంగా మారింది.