Big Shock To Jagan Govt: ఏపీ రాజధాని ఏది అంటే చాలామంది తడబడటం కామన్ అయిపోయింది. ఎందుకంటే అధికారికంగా ఇదే రాజధాని అని చెప్పేందుకు కొంత ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే గతంలో అమరావతి రాజధానిగా ఉండేది. కానీ జగన్ మూడు రాజధానుల విషయాన్ని తెరమీదకు తెస్తే.. సీన్ మొత్తం ఛేంజ్ అయిపోయింది. అయితే అనేక నిరసనల తర్వాత జగన్ ఈ మూడు రాజధానుల బిల్లను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంచితే.. ఇప్పుడు కేంద్రం మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్‌కు షాక్ ఇచ్చేసింది. నిన్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారం మీద బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. అసలు ఏపికి రాజధాని ఏదో తెలియట్లేదని, క్లారిటీ ఇవ్వాలంటూ కోరారు. ఇక దీనికి సమాధానంగా హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పుకొచ్చారు.
Also Read: ఏపీలో సిమెంట్ కంపెనీలపై సర్కారుకెందుకింత పక్షపాతం?
తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఏపీకి అమరావతి రాజధాని అంటూ చెప్పుకొచ్చారు. అయితే గతంలో మూడు రాజధానుల బిల్లును జగన్ తెచ్చినప్పుడు.. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలు జిల్లాను జ్యుడీషియల్ కేపిటల్‌గా అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతిని ఫిక్స్ చేస్తున్నట్టు అప్పట్లో చెప్పారని నిత్యానందరాయ్ వెల్లడించారు. అయితే ఆ తర్వాత అధికారికంగా ఆ బిల్లును వెనక్కు తీసుకున్నట్టు తమకు తెలియదని వివరించారు.
తమకు అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేదని, కాబట్టి తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం అమరావతియే రాజధాని అంటూ వివరించారు. కాగా మొన్న రెండు రోజుల కిందట ఆర్బీ నుంచి ఓ లెటర్ వచ్చింది. ఏపీలో రాజధాని ఏదో చెప్పిన తర్వాతే తమ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తామంటూ చెప్పింది. అంటే ఇలా కేంద్రంలో ఉన్న సంస్థ ఒక్కోటి ఒక్కో విధంగా స్పందించడం అందరినీ షాక్ కు గురి చేస్తుంది. అయితే జగన్‌కు రాజధాని విషయంలో కేంద్రం షాక్ ఇచ్చిందనే అంటున్నారు.
Also Read: కేంద్రం తీరుతో నైరాశ్యంలో బీజేపీ నేతలు?