https://oktelugu.com/

మరో ఉద్యమం చేపట్టిన రాజధాని రైతులు..!

అమరావతిలోని రైతులు రాజధానికి ఏ మూహూర్తంలో భూములు ఇచ్చరో గాని కొంత కాలంగా వారు ఉద్యమాల పేరుతో రోడ్లకే పరిమితం అవుతున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 252 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా మరో ఉద్యమానికి రైతులు చేపట్టారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశాలకు ప్రధమ ప్రాధాన్యత దక్కేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం […]

Written By: , Updated On : August 26, 2020 / 07:55 PM IST
Follow us on


అమరావతిలోని రైతులు రాజధానికి ఏ మూహూర్తంలో భూములు ఇచ్చరో గాని కొంత కాలంగా వారు ఉద్యమాల పేరుతో రోడ్లకే పరిమితం అవుతున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని 252 రోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా మరో ఉద్యమానికి రైతులు చేపట్టారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా ప్రభుత్వం కౌలు చెల్లించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అంశాలకు ప్రధమ ప్రాధాన్యత దక్కేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి తారుమారు అయ్యింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే జూన్ నాటికి కౌలు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌలు చెల్లించలేదు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!

దీంతో రాజధాని రైతులు మరోమారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ ను కలిసి కౌలు చెల్లించాలని కోరడానికి రాజధాని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటీకీ కొందరు సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకోవడం అక్కడ మరి కొందరిని అరెస్టు చేసి సింగ్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీరికి మద్దతుగా వచ్చిన సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేశారు.

రాజధానిలో 22 వేల మంది రైతులు సుమారు 32 వేల ఎకరాలను రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. జరీబు భూములకు రైతులకు ఎకరాకు రూ.50 వేలు, మెట్ట భూముల రైతులకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఏటా కౌలు చెల్లించాలని ప్రభుత్వం ఒప్పందం, అదే విధంగా కౌలు ఏటా పది శాతం పెంచాల్సి ఉంది. ఏటా కౌలు రూపంలో రూ.189 కోట్లు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం మూడు నెలలగా రైతులు కౌలు చెల్లించలేదు.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

కౌలు చెల్లిస్తే రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం కావాలనే కౌలు చెల్లింపులో జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర సంక్షేమ పథకాలకు రూ.వేల కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం రాజధాని రైతులకు చెల్లించాల్సిన కౌలు రూ.189 కోట్లు విడుదల చేయడంలో జాప్యం చేయడం పెద్ద విషయమేమీ కాదనేది వీరి భావన.