https://oktelugu.com/

‘మంత్రుల’పై సర్వేలో ఏం తెలిసిందంటే..!

జగన్ కేబినెట్ లో మంత్రులు ఆయన మాట వినడం లేదా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కారణం మంత్రుల పనితీరు ముఖ్యమంత్రి జగన్ ఆశించిన విధంగా లేకపోవడంతో పాటు అవినీతికి దూరంగా ఉండమని సీఎం చెబుతుంటే మంత్రులు మాత్రం ఆ ఒక్కటి చెప్పోదన్నట్లుగా వ్యవహరిస్తున్నారంట. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే వెల్లడైనట్లు సమాచారం. ప్రభుత్వం పీకే కన్సల్టింగ్ వాలంటీర్ సిష్టం సర్వే పేరుతో నిర్వహించిన ఈ సీక్రెట్ సర్వేలో వైసీపీ మంత్రుల తీరుపై […]

Written By: , Updated On : August 26, 2020 / 08:09 PM IST
Follow us on


జగన్ కేబినెట్ లో మంత్రులు ఆయన మాట వినడం లేదా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కారణం మంత్రుల పనితీరు ముఖ్యమంత్రి జగన్ ఆశించిన విధంగా లేకపోవడంతో పాటు అవినీతికి దూరంగా ఉండమని సీఎం చెబుతుంటే మంత్రులు మాత్రం ఆ ఒక్కటి చెప్పోదన్నట్లుగా వ్యవహరిస్తున్నారంట. ఈ విషయం ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే వెల్లడైనట్లు సమాచారం. ప్రభుత్వం పీకే కన్సల్టింగ్ వాలంటీర్ సిష్టం సర్వే పేరుతో నిర్వహించిన ఈ సీక్రెట్ సర్వేలో వైసీపీ మంత్రుల తీరుపై ప్రజల్లో తీవ్ర అంసతృప్తి ఉన్న విషయం స్పష్టమైందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.

Also Read: వైసీపీ ఎమ్మెల్యేపై కోర్టుకెక్కిన పార్టీ నాయకులు..!

అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రుల ఆదిపత్యం, అవినీతి, బంధుప్రీతి ఎక్కువగా ఉందని, ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య విభేదాలు, సొంత నియోజకవర్గాలలో సైతం మంత్రులు పట్టు సాధించకపోవడం వంటి అనేక విషయాలు ఈ సర్వేలో వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట కొందరు మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరిలో ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి సుచరిత, పర్యాటక శాఖ మంత్రి అవంతి తదితరులు ఈ జాబితాలో ఉన్నారు.

Also Read: సుప్రీం కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది…! కానీ జగన్ హ్యాపీ

తాజా సర్వేలో మరింత మందిపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, ఇది పార్టీకి, ప్రభుత్వానికి సరైంది కాదనే విషయం స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే రెండున్నరేళ్ల పాటే మంత్రి పదవుల్లో ఉంటారని అనంతరం 90 శాతం మంది పదవులు కోల్పోతారని తేల్చి చెప్పారు. ఇప్పటికి14 నెలలే పూర్తవడంతో కేబినెట్లో మార్పులు చేయడానికి మరో 16 నెలల గడువు మాత్రమే ఉండటంతో దీపం ఉండగానే ఇల్లు చక్కెబెట్టుకోవాలని కొందరు మంత్రులు తాపత్రయ పడుతున్నారు. మంత్రులపై ప్రజల్లో సదాభిప్రాయం తీసుకురావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం నిర్ణయాలు తీసుకుంటారు, ఏలా దారిలోకి తెచ్చుకుంటారు అనేది ఇప్పుడు పార్టీ నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది.