spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Somu Veerraju- Pawan Kalyan: జనసేనతోనే పొత్తు – సీఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ .....

Somu Veerraju- Pawan Kalyan: జనసేనతోనే పొత్తు – సీఎం అభ్యర్థిగా పవన్‌ కళ్యాణ్‌ .. తేల్చి చెప్పిన సోము వీర్రాజు

Somu Veerraju- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేనతో తాము కలిసి పనిచేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జనసేన – బీజేపీ మధ్య చెడిందని, జనసేనాని బీజేపీని పక్కన పెడుతున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ స్టేట్‌ చీఫ్‌ ఖండించారు. 2024 ఎన్నికల వరకూ తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Somu Veerraju- Pawan Kalyan
Somu Veerraju- Pawan Kalyan

సీఎం అభ్యర్థిపై క్లారిటీ..
జనసేనతో కలిసి పనిచేస్తున్నామని పునరుద్ఘాటించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వచ్చే ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థిపై కూడా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎప్పుడూ ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎన్నికల ముందు ప్రకటించదన్నారు. గతేడాది జరిగిన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో మాత్రమే తొలిసారిగా సీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రకటించామన్నారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో గానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నడూ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదన్నారు.

జన సేనాని సీఎం అభ్యర్థిత్వంపై..
జనసేనతో పొత్తు ఎన్నికల వరకూ కొనసాగుతుందని చెప్పిన సోము వీర్రాజు.. 2024 ఎన్నికల్లో కూటమి తరఫున సీఎం అభ్యర్థి జనసేనాని పవన్‌ కావొచ్చన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆంధ్రప్రదేశ్‌ పర్యటన సందర్భబంగా ఈ విషయాన్ని జన సేన నేతలు ప్రతిపాదించారని, దీనిపై జేపీ.నడ్డా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించాల్సి వస్తే జాతీయ నాయకత్వమే ప్రకటిస్తుందన్నారు. అది జన సేనాని పవన కూడా అయి ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. దీంతో జన సైనికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Somu Veerraju- Pawan Kalyan
Somu Veerraju- Pawan Kalyan

దూకుడుగా జనసేన..
ఏపీలో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తునన జనసేన, బీజేపీ నాయకత్వం ఇచ్చే రోడ్‌ మ్యాప్, సీఎం అభ్యర్థిత్వంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలలో సోము వీర్రాజు పరోక్షంగా ఇచ్చిన హింట్‌తో జన సైనికుల్లో జోష్‌ పెరిగింది. రూట్‌ మ్యాప్‌ వస్తే అధికార పార్టీపై జస సేనానితోపాటు, క్యాడర్‌ మరింత దూకుడు ప్రదర్శిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper