Somu Veerraju- Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్న జనసేనతో తాము కలిసి పనిచేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి స్పష్టం చేశారు. ఇటీవల జనసేన – బీజేపీ మధ్య చెడిందని, జనసేనాని బీజేపీని పక్కన పెడుతున్నారంటూ వస్తున్న వార్తలను బీజేపీ స్టేట్ చీఫ్ ఖండించారు. 2024 ఎన్నికల వరకూ తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సీఎం అభ్యర్థిపై క్లారిటీ..
జనసేనతో కలిసి పనిచేస్తున్నామని పునరుద్ఘాటించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. వచ్చే ఎన్నికల్లో కూటమి సీఎం అభ్యర్థిపై కూడా క్లారిటీ ఇచ్చారు. బీజేపీ ఎప్పుడూ ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎన్నికల ముందు ప్రకటించదన్నారు. గతేడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రమే తొలిసారిగా సీఎం అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ను ప్రకటించామన్నారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో గానీ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గానీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్నడూ సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదన్నారు.
జన సేనాని సీఎం అభ్యర్థిత్వంపై..
జనసేనతో పొత్తు ఎన్నికల వరకూ కొనసాగుతుందని చెప్పిన సోము వీర్రాజు.. 2024 ఎన్నికల్లో కూటమి తరఫున సీఎం అభ్యర్థి జనసేనాని పవన్ కావొచ్చన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భబంగా ఈ విషయాన్ని జన సేన నేతలు ప్రతిపాదించారని, దీనిపై జేపీ.నడ్డా ఎలాంటి ప్రకటన మాత్రం చేయలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించాల్సి వస్తే జాతీయ నాయకత్వమే ప్రకటిస్తుందన్నారు. అది జన సేనాని పవన కూడా అయి ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. దీంతో జన సైనికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

దూకుడుగా జనసేన..
ఏపీలో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తునన జనసేన, బీజేపీ నాయకత్వం ఇచ్చే రోడ్ మ్యాప్, సీఎం అభ్యర్థిత్వంపై క్లారిటీ కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలలో సోము వీర్రాజు పరోక్షంగా ఇచ్చిన హింట్‌తో జన సైనికుల్లో జోష్ పెరిగింది. రూట్ మ్యాప్ వస్తే అధికార పార్టీపై జస సేనానితోపాటు, క్యాడర్ మరింత దూకుడు ప్రదర్శిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.
.