YCP: ఏపీ సీఎం జగన్ పై ఈగ వాలితే.. ఏనుగు వాలినంత బాధ పడిపోయే నాయకులు చాలా ఎక్కువే. జగన్ పై ప్రత్యర్థులు ఒక మాట అంటే వంద మాటలు ఆడే నేతలు సైతం ఎక్కువే. ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే.. వ్యక్తిగత దాడి చేసేటంత నాయకులు ఎక్కువే. వారిని వైసీపీ వారు ఫైర్ బ్రాండ్లు అంటారు. ప్రత్యర్ధులు బూతుల నేతలు వర్ణిస్తారు. తటస్తులు, రాజకీయాలతో సంబంధం లేని వారు వారిని అసలు నాయకులుగా పరిగణించరు. అయితేనేం అటువంటి నేతలు తమ పంధాను మార్చుకోలేదు. అయితే ఇటువంటి నేతలు విషయంలో జగన్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉన్నారు. తనపై అభిమానం చూపే వారి విషయంలో కాస్త కటువుగానే ప్రవర్తిస్తున్నారు. తనపై కొండంత అభిమానం చూస్తే ముగ్గురు నేతలను పక్కన పెట్టారు.
జగన్ అంటే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎనలేని అభిమానం. జగన్ ఎవరైనా ఏమైనా అంటే తన వయసు, హోదా చూడకుండా హాట్ కామెంట్స్ చేస్తారు. కానీ అటువంటి మల్లాది విష్ణు జగన్ పక్కన పడేశారు. ఆయన స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాసును తీసుకొచ్చారు. దీంతో ఇంత అభిమానం అంతా విష్ణు కోపంగా మార్చుకున్నారు. జగన్ తో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అనుచరులతో సమావేశమై షర్మిల వెంట నడవడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. అటు వెల్లంపల్లి సైతం సంతృప్తిగా లేరు. మార్పు వద్దని అధినేతకు కోరుతున్నారు.
ఇక మరో నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డిది అయితే మరో పరిస్థితి. ప్రకాశం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి అచేతనం చేశారు. ఒంగోలు కి పరిమితం చేశారు. ఇప్పుడు ఒంగోలు టికెట్ లేదని తేల్చేస్తున్నారు. ఉంటే గిద్దలూరు నుంచి పోటీ చేయండి అని తెగేసి చెబుతున్నారు. అవసరం అనుకుంటే పార్టీ మారుతానని సంకేతాలు ఇస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెల్లని కాసు గా మారారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కోసం ఆయనను రాజమండ్రి రూరల్ కు పంపించారు. ఆయన కూడా మనస్థాపంతోనే ఉన్నారు.
ఇక జగన్ భజనలు తరించిపోయే వారిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందుంటారు. కానీ పోటీ చేసే వారి జాబితాలో కనీసం వెనుక కూడా లేకపోయారు. ఆయన పేరు కనిపించకపోయేసరికి తల్లడిల్లి పోతున్నారు. ఏవేవో సుద్దులు చెబుతున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు జగన్ భజన చేసేవారు.. వదుల సంఖ్యలో పదవులకు దూరమవుతున్నారు. పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. ఇటువంటి వారంతా ఈరోజు సైలెంట్ గా ఉన్నా.. ప్రత్యామ్నాయం రూపంలో షర్మిల కనిపిస్తుండడంతో అటువైపు మొగ్గు చూపుతారు అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.