Janasena- Ali: ఎన్ని పార్టీలు తిరిగినా.. ఎంత ప్రచారం చేసినా కమెడియన్ అలీకి ఒక ప్రభుత్వ పదవి కూడా లభించలేదు. 2019లో వైసీపీలో చేరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు కమెడియన్ అలీ. వైసీపీ తరుఫున ప్రచారం కూడా చేశాడు. కానీ ఇప్పటికీ జగన్ పదవి ఇవ్వలేదు. మొదట ‘రాజ్యసభ ’ ఇస్తానని మాట ఇచ్చాడని.. ఆ తర్వాత నామినేటెడ్ పదవి.. వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇలా ఏదో ఒకటి వస్తుందనుకుంటే ఒక్క పదవి కూడా జగన్ ఇవ్వకపోవడంతో అలీ సహా పోసాని, జీవిత లాంటి వారు మౌనంగా ఉండిపోతున్నారు.

అందుకే ఇక వైసీపీలో ఉండి వేస్ట్ అని..తన ఆప్తమిత్రుడు పవన్ కళ్యాణ్ స్తాపించిన జనసేనలో చేరడం బెటర్ అని ఆలీ డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ మేరకు పవన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
కమెడియన్ అలీ ప్రధానంగా రాజకీయాల్లో ఎమ్మెల్యే కానీ.. ఎంపీ కావాలని ఆశపడుతున్నారు. జగన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు తన ఫ్రెండ్ అయిన పవన్ ను ఒప్పించి ఒక ఎమ్మెల్యే సీటు పొందాలని.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని అలీ డిసైడ్ అయ్యాట.. తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి కానీ లేదా.. తూర్పు గోదావరి జిల్లాలోని ఏదైనా ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు ప్రతిపాదన పెట్టాడని ఒకే అంటే జనసేనలో చేరడం ఖాయమంటున్నారు.

పవన్ కళ్యాణ్-ఆలీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. కానీ పవన్ ను విభేదించి వైసీపీలో చేరాడు అలీ. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే తామే కొట్లాడుకోలేదని.. సినిమాల్లో కలిసి ఉంటామని.. రాజకీయంగా దారులు వేరు అని అలీ అప్పట్లో చెప్పుకున్నాడు. ఇప్పుడు పవన్ దారిలోకే వస్తున్నారు.