Ravi Teja Dhamaka: ఒక హిట్టు ఇస్తే వరుసగా మూడు డిజాస్టర్ ఫ్లాప్స్ ఇస్తుంటాడు మాస్ మహారాజా రవితేజ..క్రాక్ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రవితేజ ఈ సినిమాతోనే 40 కోట్ల రూపాయిల మార్కుని అందుకున్నాడు..అంతతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన చేసిన ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి..క్రాక్ తో వచ్చిన రవితేజ మార్కెట్ మొత్తాన్ని ఈ రెండు సినిమాలు దెబ్బ తీశాయి.

ఇప్పుడు ఆయన అభిమానుల ఆశలన్నీ ‘ధమాకా’ చిత్రం పైనే ఉన్నాయి..త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల హీరోయిన్ గా నటించింది..ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మరియు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ నెల 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనం గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ ఈరోజే ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఇక ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది..రవితేజ సినిమాలకు బాలీవుడ్ లో మొదటి నుండి మంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే..ఆయనకీ అక్కడ అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ..యూట్యూబ్ లో హిందీ లో డబ్ అయినా రవితేజ సినిమాలకు వందల కొద్దీ మిలియన్ వ్యూస్ వస్తుంటాయి..ఆయన ఫ్లాప్ సినిమాలను సైతం అక్కడి ఆడియన్స్ ఎగబడిమరీ చూస్తారు..అందుకే ‘ధమాకా’ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది..ఇది రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గా నిలిచింది.

ఇది ఇలా ఉండగా రవితేజ ఖిలాడీ చిత్రం బాలీవుడ్ లో థియేటర్స్ లోనే విడుదలైంది..ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కానీ..టాక్ సరిగా లేకపోవడం తో అక్కడ కూడా ఫ్లాప్ గా నిలిచింది..ఇప్పుడు ధమాకా మూవీ సూపర్ హిట్ అయితే బాలీవుడ్ థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట మూవీ మేకర్స్.