Homeజాతీయ వార్తలుLiquor In Telangana: అత్యంత తాగుబోతులున్నది ఈ జిల్లాలోనే?

Liquor In Telangana: అత్యంత తాగుబోతులున్నది ఈ జిల్లాలోనే?

Liquor In Telangana: తెలంగాణలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయంతో మన ప్రభుత్వాు నడుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. చెట్టు పేరు చెప్పి కాయలమ్మడం అంటే ఇదే. మద్యం బాటిల్ పై మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని లేబుల్ వేసి మరీ అమ్మడం ఆశ్చర్యకరమే. అంటే ప్రభుత్వాల మనుగడ మద్యం మీదే ఆధారపడటం తెలిసిందే. దీంతో అవి వాటికి వచ్చే ఆదాయ వనరును ఎందకు కాదనుకుంటాయి. మద్యం అమ్మేది వారే. మళ్లీ తాగితే పరీక్షలు చేసి జరిమానా విధించేది వారే. ఇదెక్కడి విడ్డూరమో తెలియదు.

Liquor In Telangana
Liquor In Telangana

మందుకున్న మహిమ అలాంటిది మరి. మద్యం తాగకపోతే వాడినో వింతగా చూస్తారు. తాగితే అంతా సాధారణమే అని సర్దుకుపోతారు. పైగా మందు తాగనివాడు వచ్చే జన్మలో దున్నపోతై పుడతాడని శాపనార్థాలు పెడతారు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని చెబుతూ దాన్ని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వం నడవడం ఓ చోద్యమే. ఈ నేపథ్యంలో మందు ప్రభావంతో కాపురాలు కూలిపోయినా, జీవితాలు మారిపోయినా మాకు సంబంధం లేదనే చెబుతారు.

మద్యం ద్వారా ఏటా రూ. కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రతి పండగకు వచ్చే ఆదాయం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తోంది. అంతటి మహత్తర ఆదాయం సంపాదించే కామధేనువు మందు కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మద్యం ప్రియులు జనగామ జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జనాభాలో 60.6 శాతం మద్యం ప్రియులున్నట్లు సమాచారం. దీంతో అత్యధికంగా మందు తాగే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్లానింగ్ విభాగం వెల్లడించిన నిజాలు చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తోంది.

Liquor In Telangana
Liquor In Telangana

58.4 శాతంతో తరువాత స్థానంలో యాదాద్రి, పిమ్మట 56.6 శాతంతో మహబూబ్ నగర్ జిల్లాలుండటం గమనార్హం. హైదరాబాద్ లో ఎక్కువ జనాభా ఉన్నా ఇక్కడ 28 శాతం మందే మద్యం ప్రియులున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో మద్యం తాగే వారి సంఖ్య సగటున 43 శాతంగా ఉంది. ప్రతి వంద మంది మహిళల్లో ఏడుగురు మద్యం తాగుతుండగా మెదక్ లో ఇది 23.8 శాతంగా ఉంటోంది. ఈ క్రమంలో మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వానికి భారీగానే ఆదాయం సమకూరుతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] AP Cabinet Expansion: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కొత్తగా మంత్రివర్గంలో చేరేదెవరు? పాతవారిలో ఎవరిని కొనసాగిస్తారనే విషయంపై అందరిలో ఉత్కంఠ సాగుతోంది. మంత్రులంతా నిన్ననే రాజీనామాలు చేసినా వారిలో ఐదారుగురు మాత్రం పాతవారు కొనసాగుతారనే విషయం మంత్రి కొడాలి నాని చెప్పడంతో వారు ఎవరనే దానిపైనే చర్చ సాగుతోంది. పాతవారిలో సమర్థులైన వారిని తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular