Aishbagh Stadium overbridge: మనదేశంలో పేరుపొందిన నగరాలలో భోపాల్ కూడా ఒకటి.. ఇది మధ్యప్రదేశ్ రాజధానిగా ఉండి. భోపాల్ లో వాహనాల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీని నియంత్రించడానికి ఐష్ బాగ్ స్టేడియం సమీపంలో కొత్తగా రైల్వే ఓవర్ బ్రిడ్జి ని నిర్మించారు. దీని వ్యయం దాదాపు 18 కోట్లు. అడ్డదిడ్డమైన కొలతలు.. ఇష్టానుసారంగా అంచనాలతో ఈ వంతెన నిర్మించారు. అయితే ఈ వంతెన నిర్మాణంలో ఒకచోట 90 డిగ్రీల మలుపు ఉన్నది. 90 డిగ్రీలు మలుపు ఉండడంతో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు… ఐష్ బాగ్ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఈ వంతెన నిర్మించారు. అయితే దీనిని ప్రారంభించక ముందే వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 90 డిగ్రీల మలుపు నేపథ్యంలో విమర్శలు వ్యక్తం అయ్యాయి.. ” ఇది మధ్యప్రదేశ్ రాజధానిలో ఐష్ బాగ్ ప్రాంతంలో నిర్మించిన రైలు ఓవర్ బ్రిడ్జి. దీనిని పూర్తి చేయడానికి ఏకంగా 10 సంవత్సరాల పట్టింది.
ఇది ఇంజనీరింగ్ మార్వెల్ లాంటిది. విరాళాల ద్వారా ఇంజనీర్లు డిగ్రీలు అందుకున్నప్పుడు.. ఇలాంటి వంతెనలు నిర్మాణమవుతాయి. సమయంలో సౌకర్యం కాకుండా విపత్తులు లభిస్తాయి. ఇది తొంబై డిగ్రీల మలుపుతో కూడుకున్న ప్రమాదం” అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనికిమాలిన వంతెన కోసం 18 కోట్లు ఖర్చు చేశారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. “అడ్డగోలుగా పనులు చేసి జనాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి పనికిమాలిన వంతెనలు కట్టి ప్రజల ప్రాణాలు తీద్దామనుకున్నారా.. ఇలాంటి వంతెనలు నిర్మించి ముప్పును బహుమతిగా ఇద్దామనుకున్నారా.. ఈ వంతెనల మీద ప్రమాదాలు జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ.. ఇలాంటి వ్యవహారాలు ఎంతవరకు సమంజసం.. అసలు ఇలాంటి అధికారులను ఆ పోస్టులలో ఎందుకు కొనసాగిస్తున్నారు” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: Morbi Bridge Collapse Reason: గుజరాత్ మోర్బీ వంతెన కూలడం.. మరణ మృదంగం వెనుక అసలు నిజాలివి!
అధికారులు సమర్ధించుకుంటున్నారు
ఈ వంతెన నిర్మాణాన్ని అధికారులు సమర్ధించుకుంటున్నారు. మెట్రో స్టేషన్ నిర్మాణం వల్ల అక్కడ తగిన స్థాయిలో భూమి అందుబాటులో లేదని.. అందువల్లే దీనిని ఇలా నిర్మించినట్టు పేర్కొన్నారు. రెండు కాలనీలను కలపడమే దీని ఉద్దేశమని పేర్కొన్నారు.. యువతని మీదుగా చిన్న చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తుకు ఆదేశాలు చారి చేస్తామని పిడబ్ల్యుడి శాఖ మంత్రి రాకేష్ సింగ్ పేర్కొన్నారు. మొత్తానికి ఈ వంతెన నిర్మాణాన్ని అధికారులు సమర్ధించుకోగా.. సోషల్ మీడియాలో మాత్రం తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి..