https://oktelugu.com/

 Trichy Airport : రెండు గంటలు ఆకాశంలోనే విమానం.. ఎయిర్ పోర్ట్ లో హైఅలెర్ట్.. అసలేమైంది? ఎందుకంతగా మోహరించారంటే?

తమిళనాడు, తిరుచ్చిలో ఎయిర్ ఇండియా విమానం AXB613 సాయంత్రం 5.40కి తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి చైనాలోని షార్జాకు స్టార్ట్ అయింది. ఐతే.. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో ఏదో తేడా ఉన్న విషయం గమనించారు ఫైలట్. వెంటనే ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు పైలెట్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 11, 2024 / 10:06 PM IST

    Trichy Airport

    Follow us on

    Trichy Airport :  తమిళనాడు తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌ దగ్గర హైటెన్షన్‌ తలెత్తింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్యను గుర్తించిన వెంటనే పైలట్‌ ఎమెర్జెన్సీ ప్రకటించడంతో జనాల్లో కూడా మరింత టెన్షన్ మొదలైంది. అయితే సిబ్బంది ఏటీసీని అలర్ట్‌ చేశారు. రెండున్నర గంటలకుపైగా ఫ్లయిట్‌ గాల్లోనే చక్కర్లు కొట్టి ఆ తర్వాత ల్యాండ్ అయింది. ఫ్యూయిల్‌ బర్నింగ్‌ ప్రాసెస్‌ ను కొనసాగించారు.మొత్తం మీద విమానాన్ని తిరుచ్చిలో సేఫ్‌ గా ల్యాండ్ చేశారు. సమస్య సద్దుమనగడంతో 140 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

    ఇంతకీ పూర్తి విషయం ఏంటి? ఏం జరిగిందంటే? తమిళనాడు, తిరుచ్చిలో ఎయిర్ ఇండియా విమానం AXB613 సాయంత్రం 5.40కి తిరుచ్చి ఎయిర్‌పోర్టు నుంచి చైనాలోని షార్జాకు స్టార్ట్ అయింది. ఐతే.. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో ఏదో తేడా ఉన్న విషయం గమనించారు ఫైలట్. వెంటనే ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు పైలెట్. తిరిగి విమానాన్ని వెనక్కి తీసుకొని వచ్చారు. తర్వాత విమానాన్ని ల్యాండ్ చెయ్యాలి అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. విమానంలో హైడ్రాలిక్ వ్యవస్థ దెబ్బతిన్నదట. అందువల్ల దాన్ని వెంటనే ల్యాండ్ చెయ్యలేకపోయారు.

    ఫ్లైట్‌లో 141 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని సురక్షితంగా ఎలా కిందకు దింపాలి అర్థం కాలేదు. ఫ్లైట్ డైరెక్టుగా దిగితే, పేలిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల విమానంలో ఫ్యూయల్‌ని పూర్తిగా అవగొట్టాలని అనుకున్నారు పైలెట్. దీంతో విమానాన్ని గాల్లోనే చక్కర్లు కొట్టేలా చేశారు. ఈ పరిస్థితిని చూస్తున్న ప్రయాణికులు చాలా టెన్షన్ పడ్డారు. ఏ క్షణం ఏమవుతుందో అని భయపడ్డారు.

    సాధారణంగా విమానాలు రన్‌వే ఖాళీగా లేకపోతే, గాల్లో 5 నిమిషాలు మాత్రమే చక్కర్లు కొడతాయి. కానీ ఎయిర్ ఇండియా విమానం దాదాపు 2 గంటలు గాల్లో ఉంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రతి ఒక్కరు భయంకరమైన, టెన్షన్ పూరిత సమయాన్ని గడిపారు. తిరుచ్చి ఎయిర్ పోర్టులో మిగతా విమానాలను అక్కడి నుంచి తరలించారు. రన్‌వేని సిద్ధంగా ఉంచారు. అలాగే.. ఎయిర్‌పోర్టులోని ఫ్యూయల్ ట్యాంకర్లను కూడా పంపించేశారు. తిరుచ్చి ఎయిర్‌పోర్టులో 20 అంబులెన్స్‌లు, 20 ఫైర్ ఇంజిన్లు, పారా మెడికల్ సిబ్బందిని వెంటనే రప్పించారు.

    చివరకు విమానంలో ఫ్యూయల్ చివరి దశకు వచ్చిన సమయంలో పైలెట్ జాగ్రత్తగా విమానాన్ని రాత్రి 8 గంటల సమయంలో ల్యాండ్ చేయడంతో ప్రతి ఒక్కరు ఊపిరిపీల్చుకున్నారు. మొత్తం మీద ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని దేవుడి మీద బారం వేసిన ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. ఎయిర్‌పోర్టులో అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు. మొత్తానికి ఆ రెండు గంటలు మన దేశ చరిత్రలో ప్రత్యేక అధ్యాయం అనుకోవచ్చు. విమానయాన చరిత్రలో ఇదో అలర్ట్ అయ్యే, ఆలోచించదగ్గ అంశంగా నిలిచిపోనుంది.