Homeజాతీయ వార్తలుAir India Controversy: సింధూరం పెట్టుకోవద్దు.. మంగళసూత్రం ధరించొద్దు.. ఇంకా నయం..

Air India Controversy: సింధూరం పెట్టుకోవద్దు.. మంగళసూత్రం ధరించొద్దు.. ఇంకా నయం..

Air India Controversy: ప్రఖ్యాత కళ్లద్దాల తయారీ సంస్థ లెన్స్ కార్ట్ ఓ మతానికి సంబంధించిన కట్టుబాట్ల వ్యవహారంలో వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఈ సంస్థ మీద సోషల్ మీడియాలో ఒక రకమైన యుద్ధం సాగుతోంది. ఇప్పటికే 4500 కోట్లను ఆ కంపెనీ నష్టపోయింది. అయినప్పటికీ దేశ ప్రజలు ఆ కంపెనీ యాజమాన్యంపై మండిపడుతూనే ఉన్నారు. ఆ సంస్థ యాజమాన్యం వ్యవహరించిన తీరు వల్ల ఇప్పటికే కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ సంఘటన మర్చిపోకముందే మరో సంస్థ వివాదంలో చిక్కుకుంది. అది కాస్త దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారిపోయింది.

వాస్తవానికి మతపరమైన విషయాలలో ఆయా సంస్థలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి మనోభావాలను పూర్తిగా గౌరవించాలి. ఎందుకంటే సంస్థలో పనిచేస్తున్న వారు పని మాత్రమే చేయాలి. ఆ విషయాన్ని యాజమాన్యం గుర్తించాలి. పనిచేసేవారిని మాత్రమే విధుల్లోకి తీసుకోవాలి. అలాకాకుండా ఉద్యోగుల మతపరమైన వ్యవహారాలలో యాజమాన్యం వేలు పెడితే.. ఆ తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అప్పట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ.. నవరాత్రుల సందర్భంగా ఫుడ్ మెనూ లో నాన్ వెజ్ యాడ్ చేసింది. దీంతో ఆ సంస్థ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంతకి ప్రజలలో నెగిటివిటీ తగ్గకపోవడంతో లెంపలు వేసుకోవాల్సి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. మెజారిటీ మతస్తుల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు మనదేశంలో చర్చకు దారితీస్తోంది.

తాజాగా ఎయిర్ ఇండియా అనే సంస్థ ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. క్యాబిన్ లో పనిచేసే సిబ్బంది సింధూరం ధరించకూడదట.. మంగళ సూత్రాలు పెట్టుకోకూడదట.. సిబ్బంది నుదుట తిలకం కనిపించకూడదట. చేతికి పెళ్లి గాజులు ఉండకూడదట. మతపరమైన నల్లదారాలు.. పూసలు.. మెడలో తాళి.. గొలుసు.. హారాలు ధరించకూడదట. ముక్కుపుడకలు కూడా ఉండకూడదట. కాలు మెట్టెలు.. పట్టీలకు కూడా అనుమతి లేదట. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా సంస్థ హ్యాండ్ బుక్ లో ప్రస్తావించడం విశేషం. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే దీనిపై స్పందించడానికి ఎయిర్ ఇండియా ప్రతినిధులు ఇంతవరకు ముందుకు రాలేదు.

హ్యాండ్ బుక్ లో ప్రస్తావించిన ఈ అంశాలు ఒక ఉద్యోగి ద్వారా బయటికి వచ్చాయి. మెజారిటీ మతాన్ని అనుసరించే వారు మాత్రమే ఈ విధానాలను పాటిస్తారు. అటువంటి వారి మనోభాలను దెబ్బతీసే విధంగా హ్యాండ్ బుక్ లో రాయడం పట్ల ఎయిర్ ఇండియా సంస్థ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇటీవల లెన్స్ కార్ట్ యాజమాన్యం కూడా ఇటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. సోషల్ మీడియా ద్వారా లెన్స్ కార్ట్ కు వ్యతిరేకంగా ఒక ఉద్యమమే జరుగుతోంది. ఈ ఘటనను మర్చిపోకముందే ఎయిర్ ఇండియా తన హ్యాండ్ బుక్ లో ఈ విషయాలను ప్రస్తావించడం కలకలం రేపుతోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular