https://oktelugu.com/

అక్రమాలపై గురి.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాకిచ్చిన కేటీఆర్?

ఎన్నడూ లేనివిధంగా ఇటీవల వరంగల్ నగరం వరద ముంపునకు గురైన సంగతి తెల్సిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని 120పైగా కాలనీలు జలమయయ్యారు. కరోనా టైంలో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సమయంలో కురిసిన చిన్నపాటి వానలకే వరంగల్ సిటీ మునిగిపోయింది. దీంతో నగరవాసులు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో తేలికపాటి వర్షాలకు హైదరాబాద్ నగరం మునిగేదని.. కేసీఆర్ పాలనలో వరంగల్ నగరం కూడా ఆ జాబితాలో చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2020 6:11 pm
    Follow us on

    ఎన్నడూ లేనివిధంగా ఇటీవల వరంగల్ నగరం వరద ముంపునకు గురైన సంగతి తెల్సిందే. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు నగరంలోని 120పైగా కాలనీలు జలమయయ్యారు. కరోనా టైంలో ప్రజలంతా ఇంటికే పరిమితమైన సమయంలో కురిసిన చిన్నపాటి వానలకే వరంగల్ సిటీ మునిగిపోయింది. దీంతో నగరవాసులు ఎటువెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో తేలికపాటి వర్షాలకు హైదరాబాద్ నగరం మునిగేదని.. కేసీఆర్ పాలనలో వరంగల్ నగరం కూడా ఆ జాబితాలో చేరిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

    Also Read: కాంగ్రెస్, టీఆర్ఎస్ దాగుడుమూతలు!

    ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటంతో కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించి బాధితులతో మాట్లాడారు. వరంగల్లో చెరువులు, నాలాలను కబ్జా చేసి కొందరు అక్రమంగా నిర్మాణాలు చేయడంతోనే వరంగల్ నగరం ముంపునకు గురైందంటూ పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన కలెక్టర్, కార్పొరేషన్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించేలా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

    తాజాగా వర్ధన్నపేట  టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరూరి రమేష్ చెందిన క్యాంపు కార్యాలయాన్ని గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. దీనిపై టీఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. నాలాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించినట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్యే అరూరి రమేష్ స్వచ్చంధంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ మేరకు ఎమ్మెల్యేకు చెందిన క్యాంపు కార్యాలయాన్ని వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది.

    Also Read: దుబ్బాకలో పోటీచేస్తే చంపేస్తాం.. బెదిరింపులు

    ప్రస్తుతం వరంగల్ నగరంలో నాలాలపై అక్రమంగా నిర్మించిన భవనాలు.. ప్రహరీల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కలెక్టర్, కార్పొరేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ సూచనలు చేశారు. నగరంలో 324నిర్మాణాలు నాలాలపై ఉన్నట్లు గుర్తించామని.. వాటిలో 68 తొలగించినట్లు మంత్రికి వివరించినట్లు సమాచారం. ఇటీవల భద్రకాళి, ములుగు రోడ్డు, నయీంనగర్‌ నాలాలపై ఉన్న ఆక్రమణ నిర్మాణాలను బల్దియా సిబ్బంది తొలగించారు. మంత్రి కేటీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో అక్రమాల నిర్మాణాల కూల్చివేతపై అధికారులు దూకుడుగా వెళుతుండటం గమనార్హం.

    సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా ఆక్రమణల కూల్చివేతల విషయంలో కేటీఆర్ నిక్కచ్చిగా ఉండడం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైతం కూల్చివేస్తుండడం వరంగల్ లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.