Ahmedabad Plane Crash: విమానంలో ఉన్న ప్రయాణికులు ప్రయాణానికి సిద్దమవుతున్న దృశ్యాలు, లోపలి పరిస్థితులు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించాయి. విమానం టేకాఫ్ అయ్యే ముందు ప్రయాణికులు తమ సీట్లలో కూర్చుని సీట్ బెల్టులు కట్టుకున్న దృశ్యాలను అతడు లైవ్‌లో చూపించాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత జరిగిన భయానక ఘటనను ఊహించలేకపోయారు.
ఈ ఫేస్‌బుక్ లైవ్ ఇప్పుడు విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక ఆధారంగా మారింది. విమానం టేకాఫ్ సమయంలో ఏవైనా సాంకేతిక లోపాలు కనిపించాయా? లేదా ప్రయాణికుల్లో ఎవరి ఆందోళన కనిపించిందా? అనే కోణాల్లో నిపుణులు ఈ వీడియోను పరిశీలిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలు పోవడంతో పాటు విమానం పూర్తిగా దగ్ధమైంది. ప్రభుత్వం, విమాన సంస్థ ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి.
ఫేస్‌బుక్ లైవ్‌తో ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే అనే ప్రశ్నకు కొంతమేర క్లారిటీ రానుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Facebook live video before Ahmedabad ,Gujrat plane crash #planecrash pic.twitter.com/mO2Yyq9lem
— Honest Cricket Lover (@Honest_Cric_fan) June 12, 2025