Homeజాతీయ వార్తలుAhmedabad Gold Incident: "అహ్మదాబాద్" ప్రమాదస్థలిలో 70 తులాల బంగారం దొరికితే.. ఇతను ఏం చేశాడో...

Ahmedabad Gold Incident: “అహ్మదాబాద్” ప్రమాదస్థలిలో 70 తులాల బంగారం దొరికితే.. ఇతను ఏం చేశాడో తెలుసా?

Ahmedabad Gold Incident:  డబ్బు కోసం అయిన వాళ్లను అంతం చేస్తున్న రోజులు ఇవి. ఆస్తుల కోసం అడ్డగోలు పనులు చేస్తున్న దారుణమైన దినాలు ఇవి. ఇలాంటి రోజుల్లో ఇతడు ఒకరకంగా బంగారం అని చెప్పుకోవచ్చు. ఇతర వ్యక్తిత్వం స్వర్ణ సమానం అని భావించవచ్చు.

మనుషుల మధ్య మానవత్వం కనుమరుగవుతోంది. బంధాలు, అనుబంధాలు మాయమవుతున్నాయి. అవసరాలు మాత్రమే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అవసరాలు మనుషులను ఎంత దాకైనా తీసుకెళ్తున్నాయి. అందువల్లే మానవ సంబంధాలు “మనీ” బంధాలుగా మారిపోతున్నాయి. అయితే అప్పుడప్పుడు కొందరి రూపంలో మానవత్వం పరిమళిస్తూనే ఉంది. గంజాయి వనంలో తులసి మొక్క లాగా కనిపిస్తూనే ఉంది. అలాంటిదే ఈ సంఘటన కూడా.. వాస్తవానికి కళ్ళ ముందు 70 తులాల బంగారం ఉన్నప్పటికీ.. ఇతడు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా దానిని చేరాల్సిన చోటుకు చేర్చాడు. మనిషిగా.. మానవత్వం ఉన్న వ్యక్తిగా 100 మెట్లు పైకి ఎక్కాడు.

ఇటీవల ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణంలో దాదాపు 200 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇప్పటికీ మృతదేహాలను సంబంధిత అధికారులు వారి బంధువులకు అందిస్తూనే ఉన్నారు. అయితే ఈ దారుణం జరిగిన పరిసర ప్రాంతంలో మృతులకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు పడిపోయాయి. భారీగా విస్పోటనం జరగడంతో అవన్నీ కూడా దూర ప్రాంతాల్లో పడిపోయాయి.. అయితే అవి అధికారుల కంటపడలేదు. మృతుల కుటుంబ సభ్యులకు దొరకలేదు. అయితే వాటన్నింటినీ ఓ వ్యక్తి సేకరించాడు. పది రూపాయల నోటు రోడ్డు మీద కనపడగానే జేబులో వేసుకొని ఈ రోజుల్లో.. విమాన ప్రమాద స్థలంలో ఏకంగా 70 తులాల బంగారం స్వయంగా సేకరించి.. పోలీసులకు అప్పగించాడు ఆ మహానుభావుడు.. ఆ బంగారం విలువ దాదాపు ఇప్పటి బహిరంగ మార్కెట్ ప్రకారం 80 లక్షల వరకు ఉంటుంది. అయినప్పటికీ అతడు ఏమాత్రం ఆ బంగారం కోసం ఆశపడకుండా వెంటనే అధికారులకు అప్పగించాడు.

అయితే అతడి పేరు గాని, వివరాలు గాని బయటపడలేదు. మరోవైపు అతనికి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. ఈ రోజుల్లో డబ్బుకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చి.. మనుషులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అలాంటిది చనిపోయిన వారు ఎవరో తెలియదు.. వారితో ఎటువంటి సంబంధమూ లేదు. అయినప్పటికీ అతడు తీవ్రంగా ప్రయాసపడ్డాడు. సుధీర ప్రాంతాలలో ఉన్న వస్తువులను సేకరించాడు. ఇందులో బంగారం కూడా ఉంది. ఆ బంగారం మొత్తం 70 తులాల వరకు ఉంటుంది. ఇప్పటి బహిరంగ మార్కెట్లో దాని విలువ 80 లక్షల వరకు ఉంటుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏమాత్రం ఆశపడకుండా.. ఆ బంగారం మొత్తాన్ని సంబంధిత అధికారులకు ఇచ్చాడు. బాధిత కుటుంబ సభ్యులకు దానిని చేరవేయాలని అతడు కోరాడు.. అతడు చేసిన పనిని అధికారులు అభినందించారు. మానవత్వాన్ని బతికించావని భుజం తట్టారు.

Also Read:   Ahmedabad plane crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదానికి అసలు కారణం తెలిసింది..

ఈ ప్రమాదం జరిగిన తర్వాత కేవలం మృతదేహాల కోసమే అధికారులు ప్రయత్నాలు చేశారు. అంతేతప్ప మృతులు ధరించిన వస్తువులను సేకరించే పని మాత్రం చేపట్టలేకపోయారు. అయితే ఇప్పటికి కూడా అధికారులు ఆదేశాగా ఆలోచన చేయలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం మృతుల కుటుంబ సభ్యుల వస్తువులను సేకరించే పనిలోపడ్డాడు. తను సేకరించిన వస్తువులను మొత్తం అధికారులకు అందించాడు.. అంతేకాదు అవన్నీ కూడా మృతుల కుటుంబ సభ్యులకు ఇవ్వాలని వారిని కోరాడు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular